అయినా అతని మాటలు పట్టుకుని రిషిని ఇలా నిలదీస్తున్నారు ఇదేమి బాగోలేదు పిన్ని అంటూ జగతిని మందలించినట్లుగా మాట్లాడుతాడు శైలేంద్ర. శైలేంద్రవైపు అసహ్యంగా చూస్తారు వసు, జగతి. ఈ చెక్ మనం ఇష్యూ చేయలేదు కదా అని వసుని అడుగుతాడు రిషి. ఆమె భయంతో ఏమీ మాట్లాడలేక పోతుంది. మాట్లాడు వసు..వాళ్లు మనల్ని అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు నోరు విప్పు అంటూ గట్టిగా కోప్పడతాడు రిషి. నువ్వు ఎవరికీ భయపడక్కర్లేదమ్మా ఏం జరిగిందో చెప్పు అంటాడు మినిస్టర్. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.