ఇక కూతురిని ఉద్దేశిస్తూ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. మా అమ్మాయి విదేశాల్లో చదువు పూర్తి చేసుకొని వచ్చింది. తనకు నేను పెళ్లి చేయను. నచ్చిన వాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. తర్వాత అందరికీ భోజనాలు పెడదాం అన్నాను. పెళ్లయ్యాక భర్త నచ్చకపోతే విడాకులు తీసుకోమని చెప్పాను. మనం సంతోషంగా బ్రతకడం ముఖ్యం. జనాలు ఏమనుకుంటున్నారు అనేది అనవసరమని పిల్లలకు చెప్పినట్లు తేజా వెల్లడించారు.