ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. మహేంద్ర జగతి వెళ్లిపోవడంతో డాడ్ కు నా మీద కోపం ఎందుకు.. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఫీల్ అవుతాడు. మీరు అలా ఫీల్ అవ్వకండి వాళ్ళు మన దగ్గరకు వస్తారు అని దైర్యం చెబుతుంది. ఎయిర్ పోర్ట్ లో ఉండి ఉంటారు వెళదాం పదండి అంటే నువ్వు కూడా అది నమ్ముతున్నావా? మనల్ని పక్కదారి పట్టించేందుకు అలా చెప్పారు. అని రిషి అంటాడు. అవును సార్ మీరు చెబుతుంటే నాకు అర్ధం అవుతుందని అంటుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నా పరీక్షల రిజల్ట్స్ వచ్చే టైమ్ కు రావాలి అని వసుధార అంటుంది. సరే పద అని బయల్దేరుతారు.