నువ్వు ఏం తప్పు చెయ్యలేదు.. డాక్టర్ బాబు దైర్యం చెప్తాడు. ఇప్పుడు వాళ్ళను ఎక్కడని వెతకాలి అని బాధ పడితే నేను తీసుకొస్తాను శౌర్యను నువ్వు ఏడవకు అని చెప్తాడు. తర్వాత సీన్ లో ఇంద్రుడు, చంద్రమ్మ, శౌర్య ముగ్గురు ఆటోలో వెళ్తారు. అమ్మానాన్నను వెతుకుతాం కదా అని శౌర్య అంటే ఖచ్చితంగా వెతుకుతాం అని అంటారు. మరో సీన్ లో వంటలక్క గుడిలో ఇంద్రుడు, చంద్రమ్మ సీన్స్ అన్ని గుర్తు తెచ్చుకొని గుడిలో గంటలు కొడుతూనే ఉంటుంది. ఇంటికి పద దీప అని డాక్టర్ బాబు చెప్పిన నేను తప్పు చేశాను డాక్టర్ బాబు అంటూ కన్నీళ్లు పెడుతుంది. దాదాపు ఒక పదినిమిషాలు పాటు అవే సీన్స్, అవే ఏడుపులు.