`యశోద`కి డబ్బింగ్ చెప్పడం గురించి చెబుతూ, తమిళంలో కంటే తెలుగు చెప్పడమే కష్టమని చెప్పింది. అయితే కష్టసమయంలో డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందని, కానీ తాను మొండిదాన్ని అని, అందుకే కష్టమైనా డబ్బింగ్ చెప్పానని పేర్కొంది సమంత. సినిమా గురించి చెబుతూ, తనకు చేసిన జోనర్, సేమ్‌రోల్ చేయడం ఇష్టం ఉండదని, కానీ `యూటర్న్`, `యశోద` జోనర్ దగ్గరగా ఉంటాయని చెప్పింది. అయితే `యశోద` కథ విన్నప్పుడు తాను ఎంత షాక్ అయ్యిందో, రేపు థియేటర్లలో ఆడియెన్స్ సినిమా చూసి అంతే షాక్ అవుతారని పేర్కొంది. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానున్న విషయం తెలిసిందే.