ఎపిసోడ్ ప్రారంభంలో లెక్చరర్ చెప్పినట్లు చెయ్యు అంటాడు మురుగన్. ఏం మాట్లాడుతున్నావ్ నాన్న.. అతనికి వార్నింగ్ ఇవ్వు అంటాడు పాండ్యన్. అతను నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. కనిపించినంత సాఫ్ట్ కాదు అతను. అందుకే పిచ్చి వేషాలు వేయడం ఆపి అతను చెప్పినట్లు చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మురుగన్. విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేద్దాం అని అంటారు.