ఇక మహేంద్ర వారి సంతానం గురించి చెబుతూ మా ఇద్దరికీ సింహంలాంటి కొడుకు ఉన్నాడు వాడే రిషేంద్ర భూషణ్ అని చెప్పడంతో గౌతమ్,వసుధార, దేవయాని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. షార్ట్ ఫిలిం ప్రోగ్రాం చూడటానికి వచ్చిన మినిస్టర్ ఏది జరిగినా మన మంచికే ఇప్పుడు ఇలా మీ బంధం కలవటం చాలా సంతోషంగా ఉంది అంటూ రిషి,మహేంద్ర,జగతిలను పొగుడుతూ ఉంటాడు ఇక రిషి జరిగిన దాన్ని అవమానం లాగా భావించి బాధపడి ఆడిటోరియం నుంచి వెళ్ళిపోతాడు. జగతి రిషిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.