Rakul Wishes to Father : నాన్నకు రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే విషెస్.. నాన్నంటే ఎంత ప్రేమో..

Published : Mar 02, 2022, 11:12 AM IST

హీరోయిన్ రకుల్ ప్రీత్ (Rakul Preet Singh) తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఇన్ స్టాలో పోస్ట్ షేర్ చేసింది. నాన్నపై ఉన్న ప్రేమనంతా అభిమానులతో పంచుకుంది రకుల్.    

PREV
16
Rakul Wishes to Father : నాన్నకు రకుల్ ప్రీత్ సింగ్  బర్త్ డే విషెస్.. నాన్నంటే ఎంత ప్రేమో..

రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఢిల్లీలోని ఒక సిక్కు కుటుంబంలో కుల్విందర్ సింగ్ (Kulwinder Singh), రాజేందర్ కౌర్ దంపతులకు జన్మించింది. రకుల్ సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపేస్తుంది. 

26

కుటుంబంతో పాటు మాల్దీవుల్లో ఉన్న ఢిల్లీ బ్యూటీ.. పేరెంట్స్ తో సరదగా గడుపుతోంది. తన తండ్రి కుల్విందర్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా రకుల్ స్పెషల్ గా విష్ చేసింది. తన తండ్రిపై ఉన్న ప్రేమను మొత్తం అభిమానులతో సోషల్ మీడియాలో వర్ణించింది. 
 

36

ఈ మేరకు తండ్రి కుల్విందర్ సింగ్, తల్లి రాజేందర్ కౌర్ తో కలిసి దిగిన సెల్ఫీ ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది రకుల్. ఫొటోలు షేర్ చేస్తూ నోట్ కూడా రాసింది. తన జీవితంలో తన తండ్రి ఎలాంటి పాత్ర పోషించాడో చెప్పుకొచ్చింది. 

46

‘నాకు స్ఫూర్తి, నా రోల్ మోడల్, నా బలం మీరే నాన్న.. నేను ప్రతి రోజు మీకోసం ఎదురు చూస్తున్నాను.. మీరు అన్ని విషయాల్లో నాకు మార్గనిర్దేశం చేయడం నా అదృష్టం.. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను. ఈ సంవత్సరం మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎల్లప్పుడూ గర్వించేలా చేస్తానని హామీనిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది.
 

 

 

56

కుల్విందర్ సింగ్ ఒక ఆర్మీ ఆఫీసర్. ఇంట్లో చాలా డిసిప్లైయిన్ గా ఉంటారు.  రకుల్ తన కేరీర్ ను క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్లేందుకు కుల్విందర్ సింగ్ ఒకకారణమని కూడా చెప్పొచ్చు. తండ్రి ఆర్మీ కావడంతో రకుల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్, ధౌలా కువాన్ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. తర్వాత ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాలేజ్, యూనివర్సిటీలో మ్యాథ్స్ అభ్యసించింది. 
 

 

66

రకుల్ ఒక తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నారు. ఈయన కూడా సినీ రంగంలోకి ప్రవేశించనున్నారు. ‘రామ్ రాజ్య’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. రకుల్ ఫ్యామిలీకి ముంబైలో ఇల్లు ఉన్నా.. రకుల్ మాత్రం హైదరాబాద్ లోనే నివసించేందుకు ఇష్టపడుతుందట.
 

click me!

Recommended Stories