Heroines At Shiva Temples : శివక్షేత్రాల్లో పూజా హెగ్దే, లావణ్య త్రిపాఠి, విష్ణుప్రియ .. భక్తిశ్రద్ధలతో పూజలు

Published : Mar 02, 2022, 12:16 PM ISTUpdated : Mar 02, 2022, 12:18 PM IST

మహాశిరాత్రి సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్స్ ప్రసిద్ధ శివుడి పుణ్య క్షేత్రాలను సందర్శించారు.  పూజా హేగ్దే, లావణ్య త్రిపాఠి, యాంకర్ విష్ణుప్రియ భక్తి శ్రద్ధలతో  పరమ శివుడికి ప్రత్యేక పూజలు చేసి.. భోళా శంకరుడిని దర్శించుకున్నారు.    

PREV
16
Heroines At Shiva Temples : శివక్షేత్రాల్లో పూజా హెగ్దే, లావణ్య త్రిపాఠి, విష్ణుప్రియ ..  భక్తిశ్రద్ధలతో పూజలు

ప్రభాస్ హీరోయిన్, టాలీవుడ్ గ్లామర్ క్వీన్ పూజా హెగ్దే (Pooja Hegde) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పరమశివుడి సేవలో భాగస్వామ్యమైంది. ఈ మేరకు కాశీలోని వారణాసిలో గల విశ్వేశ్వరుడి క్షేత్రాన్ని సందర్శించింది. 
 

26

గంగానదిలో నాటుపడవపై వెళ్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించింది. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, శివ దర్శనం చేసుకుంది. ‘ఓం నమః శివాయ.. మనకు కలలు వచ్చినప్పుడు శివునిలాగే ఉగ్రంగా ఉంటాం. క్షమాపణ విషయంలోనూ ఆయన లాగే దయతో ఉంటాం’ అంటూ పేర్కొంది.  
 

36

‘అందాల రాక్షసి’ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కూడా శివారాధన చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో గల ఆదియోగి పుణ్యక్షేత్రాన్ని లావణ్య త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు చేసి.. అభిమానులు, ప్రజలకు మహాశివరాత్రి శుభాక్షాంలు తెలిపింది. 
 

46

స్మాల్ స్క్రీన్ బ్యూటీ యాంకర్ విష్ణు ప్రియ (Vishnu Priya) తన స్నేహితులతో కలిసి కోయంబత్తూరులోని ఆదియోగి శివాలయాన్ని సందర్శించారు. భోళా శంకరుడికి ప్రత్యేక పూజలు చేసి, శివ దర్శనం చేసుకుంది. 
 

56

ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చీరకట్టులో పూర్తిగా ఆధ్యాత్మికతను తన మనస్సు నిండా నింపుకుంది. ఈ ఫొటోలు షేర్ చేస్తూ..  ‘దివ్యత్వం గలది,  పూర్తిగా మాయాజాలమైనది..  యోగి శివ మహదేవ్’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. 
 

66

బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ (Saara Ali Khan) కూడా గతేడాది లాగే ఈ సారి కూడా శివ నామ స్మరణ చేసింది. ఆధ్యాత్మిక చింతనతో భక్తి శ్రద్ధలతో శివుడికి ప్రత్యేక పూజలు చేసి.. శివుడి ప్రతిమలకు నమస్కరించింది. శివపూజల్లో పాల్గొన్న ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపింది. 
 

click me!

Recommended Stories