Guppedantha manasu: సాక్షి కుట్రకు వసుధార బలి.. జగతి, మహేంద్ర అన్వేషణ.. వసుకు దైర్యం ఇచ్చిన రిషి?

Published : Sep 02, 2022, 08:07 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెబర్ 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

PREV
16
Guppedantha manasu: సాక్షి కుట్రకు వసుధార బలి.. జగతి, మహేంద్ర అన్వేషణ.. వసుకు దైర్యం ఇచ్చిన రిషి?

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... మహేంద్ర జగతి లు కాలేజీకి వస్తారు. అప్పటికే గౌతమ్ కాలేజ్ బయట అంతా వెతికి ఎక్కడా కనిపించలేదని అంటాడు. రిషి కూడా కాలేజ్ అంతా వెతికి ఎక్కడ కనిపించలేదు అని చెప్తాడు.మరి ఏం చేద్దాము రేపే పరీక్ష ఒకవేళ పరీక్ష రాయకపోతే వసు జీవితమంతా అయిపోయినట్టే అని బాధపడతారు జగతి, మహీంద్ర లు.అప్పుడు గౌతమ్, వసుధార ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది భయపడంపోవధ్దు అని అంటాడు.
 

26

క్షేమంగా ఉండడం కాదురా రేపు తను పరీక్ష ఎలాగైనా రాయాలి అని రిషి అంటాడు. ఫ్రెండ్స్ అందరినీ అడిగాము ,వెతకాల్సిన ప్రదేశాలన్నీ వెతికాము అని అంటాడు అయినా ఎక్కడ లేదు, రేపు ఉదయానికి వచ్చేస్తుందిలెండి మనం అంతకుమించి ఏం చేయగలము రేపు పరీక్ష కదా చేకటి అయిపెంది అని ఇంటికి వెళ్తారు అందరూ.రిషి ని కూడా ఇంటికి రమ్మంటే లేదు నేను కాలేజ్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. వసుధార తోనే మళ్లీ తిరిగి ఇంటికి వస్తాను అని అంటాడు. ఆరోజు రాత్రికి అక్కడే పడుకుంటాడు రిషి.
 

36

ఆ తర్వాత రోజు ఉదయం లేచి వసు కి ఫోన్ చేస్తాడు. ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతలో జగతి, మహేంద్రాలు అక్కడికి వచ్చి వసు గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతారు.ఏం తెలియలేదు అని అంటాడు రిషి. ఇంతలో పుష్పా అక్కడికి వస్తుంది. వసుదార గురించి ఏమైనా తెలిసిందా అని పుష్ప నీ అడగగా తెలియలేదు అని పుష్ప అంటుంది.ఇంతలో  పరీక్షకి టైం అవుతుంది అని చెప్పి జగతి మహీంద్రాలు దానికి ఏర్పాట్లు చూస్తారు. అప్పుడు రిషి బాధపడుతూ ఎక్కడికి వెళ్లావు వసుధార, నీ జీవితమంతా దీని మీద ముడిపడి ఉన్నది కదా వదిలేస్తే ఎలాగ అని ఆలోచించుకుంటూ ల్యాబ్ బయటకి అలా నడుస్తూ వస్తాడు.
 

46

అక్కడ వసుధారని ఊహించుకుంటాడు.వసు తనతో మాట్లాడినట్టు అనుకుంటాడు.అప్పుడు రిషి కి కొన్ని బాల్స్ కనిపిస్తాయి  ఇవి వసుధర వే అని అనుకోని ఆ బాల్స్ పడిపోయిన దిక్కులో వెళ్తూ ఉంటాడు అలాగా రిషి ఆ ల్యాబ్ లో ఒక రూం లోకి వెళ్తాడు. అక్కడ వసు కిందపడి ఉంటుంది. రిషి వెంటనే వసుని ఎత్తుకుని సోఫాలో కూర్చోబెడతాడు. గౌతమ్ దగ్గరికి వెళ్లి డాక్టర్ని పిలవమని చెప్తాడు. అంతలో రిషి,వసు దగ్గరికి వెళ్లి లెగు వసుధార, నువ్వు చివరి పరీక్ష రాయాలి,రాయగలవు.
 

56

నువ్వు ఇంతవరకు చేరుకుని చివరి నిమిషంలో వదిలేస్తే ఎలాగా? నువ్వు మాలాగే లెక్చరర్ అవుతావు అన్నావు కదా ఈ పరీక్ష రాయకపోతే అది జరగదు నువ్వు దీనికోసమా పెళ్లి పీట మీద నుంచి వచ్చేసింది? అని అంటాడు రిషి. మరో వైపు, జగతి  క్లాసులో పేపర్స్ పంచుతూ ఉంటుంది ఇంక వసు రానట్టేన, తన జీవితమంతా అయిపోతుందా అని బాధపడుతూ ఉండగా వసు మేడం క్వశ్చన్ పేపర్ ఇవ్వండి అని అంటుంది.జగతి ఆనందం తో అక్కడికి వెళ్లి ఏమైంది వసు ఈ అవతారం ఏంటి,సరేలే  తర్వాత మాట్లాడుకుందాం ముందు పరీక్ష రాయు.
 

66

రాయగలవా అని అడగగా మాటిచ్చాను మేడం రాస్తాను అని అంటుంది.ఇంతలో రిషి అక్కడికి వస్తాడు.వసు కి మత్తు గా ఉంటుంది.మసక మసక గా కనిపిస్తుంది.జగతి కొంచెం మంచి నీళ్లు ఇచ్చి అలా లేపుతూ ఉంటుంది. అప్పుడు వసు, నేను రాయాలి, నేను లెక్చరర్ అవ్వాలి.ఇదే నా జీవితంలో నాకున్న లక్ష్యం. నా లక్ష్యాన్ని నేను సాధించుకోవాలి అనుకోని పరీక్ష రాస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియదు అంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories