పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. అకీరా పేరుపై ప్రాపర్టీస్, ఆ అప్పుల సంగతి ఏంటి ?

First Published Sep 2, 2022, 7:48 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగలా ప్రారంభం అయ్యాయి. ఎక్కడ చూసినా అభిమానుల సందడి కనిపిస్తోంది. ప్రతి ఏడాది పవన్ అభిమానులు బర్త్ డే సెలెబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగలా ప్రారంభం అయ్యాయి. ఎక్కడ చూసినా అభిమానుల సందడి కనిపిస్తోంది. ప్రతి ఏడాది పవన్ అభిమానులు బర్త్ డే సెలెబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆ ఇంటెన్స్ ఇంకా పెరిగింది. జల్సా, తమ్ముడు ఇలా ఫ్యాన్స్ షోలతో హోరెత్తిస్తున్నారు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ మోస్ట్ పాపులర్ హీరో. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కో చిత్రానికి రూ 50 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ లెక్కన పవర్ స్టార్ ఆస్తుల విలువ ఎవరూ ఊహించలేని అంత ఎక్కువ ఉండాలి. కానీ  ఇతర స్టార్ హీరోలకు ఉన్నత రేంజ్ ల్ పవన్ కళ్యాణ్ ఆస్తులు లేవని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా జనసేన పార్టీని నడుపుతున్నారు. ఆ భారం కూడా ఉంది కనుక ఆస్తులు ఎక్కువగా పోగేసుకోలేదు. 

పైగా పవన్ కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి స్వస్తి చెప్పి చాలా కాలమే అవుతోంది. టాలీవుడ్ సర్కిల్స్, పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తుల విలువ 200 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి జూబ్లీ హిల్స్ లో ఖరీదైన ఇంటితో పాటు.. హైదరాబాద్ శివారులో 18 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ విలువ పాతిక కోట్ల వరకు ఉంటుంది అని అంటున్నారు. 

అలాగే పవన్ కళ్యాణ్ కి 312 గ్రాముల బంగారం ఉంది. పవన్ కళ్యాణ్ బిగ్ సెలెబ్రిటీ పైగా జనసేన పార్టీ అధినేత. కాబట్టి కార్ల వాడకం ఎక్కువగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ వద్ద మెర్స్డ్ బెంజ్ ఆర్ క్లాస్ కారు, వోల్వో ఎక్స్ సి 90, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఆడి క్యూ7 లాంప్ ఖరీదైన కార్లు ఉన్నాయి. 

ఇక తన సతీమణి అన్నా లెజినోవా వద్ద 30 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తన పెద్ద కుమారుడు అకీరా పేరుమీద 1.5 కోట్లు, కుమర్తె ఆద్య పేరుపై 1.04 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పేరుపై, మరో కుమార్తె పోలేనా పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు. 

పవన్ కి వస్తున్న రెమ్యునరేషన్ జనసేన పార్టీ ఖర్చులు, ఇతర రొటేషన్ కి సరిపోతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ దాదాపు 30 కోట్లకి పైగా అప్పు కూడా ఉన్నట్లు సమాచారం. ఇందులో ట్విస్ట్ ఏంటంటే తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా పవన్ కళ్యాణ్ రెండున్నర కోట్ల అప్పు ఉన్నారు. 

పవన్ కళ్యాణ్ కి ఉండే స్టార్ స్టేటస్ తో పోల్చుకుంటే ఆయనకి ఉండే ఆస్తులు తక్కువే అని చెప్పాలి. కెరీర్ బిగినింగ్ లో కమర్షియల్ యాడ్స్ లో నటించిన పవన్.. ఆ తర్వాత తన సిద్ధాంతాలకు అవి విరుద్ధం అని స్వస్తి చెప్పారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఏకైక ఆదాయ మార్గం సినిమా మాత్రమే. ఇతర వ్యాపారాల్లో కూడా ఎక్కడా పవన్ పెట్టుబడులు లేవు. 

click me!