Guppedantha Manasu: వసుపై మనసు పారేసుకున్న గౌతమ్.. ఆ విషయాన్నీ ఏకంగా రిషితోనే చెప్తూ?

Navya G   | Asianet News
Published : Dec 15, 2021, 12:28 PM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథా నేపథ్యంలో ఈ సీరియల్ సాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
110
Guppedantha Manasu: వసుపై మనసు పారేసుకున్న గౌతమ్.. ఆ విషయాన్నీ ఏకంగా రిషితోనే చెప్తూ?

రిషి (Rishi) రెస్టారెంట్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని వసు (Vasu) సారీ చెప్పట్లేదు అని కోపంతో రగిలిపోతాడు. ఇక దాంతో తానే ఫోన్ చేసి క్లాస్ పీకాలని అనుకుంటాడు. ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.
 

210

ఇక కాలేజీలో పుష్పతో (Pushpa) నడుచుకుంటూ వస్తుంది. అప్పుడే రిషి చూసి వసును తనతో పాటు జగతిని (Jagathi) మేడమ్ ను కూడా తీసుకొని తన క్యాబిన్ దగ్గరికి వచ్చి తనను కలవమని అంటాడు.
 

310

ఇక గౌతమ్ (Gautham) రిషి వాళ్ల కాలేజ్ దగ్గరికి వచ్చి ఆ నేచర్ ని చూసి సంతోషపడుతాడు. రిషి (Rishi) క్యాబిన్ ను చూపించమని సెక్యూరిటీ ని అడుగుతాడు. మరోవైపు జగతి రిషి సార్ పిలిచినప్పుడు వెళ్లకపోతే బాగోదేమో అని అంటుంది.
 

410

వసు (Vasu) మాత్రం నేను ఎదుర్కొంటాను మేడమ్ మీరు రాకండి అని అంటుంది.  ఎటువంటి తప్పు చేయలేదు అని గట్టిగా అంటుంది. మహేంద్ర వర్మ  (Mahendra) కూడా జగతిని ఏమీ వెళ్లదని చెబుతాడు.
 

510

ఇక వసు (Vasu) రిషి దగ్గరికి బయల్దేరుతుంది. అంతలోనే రిషి దగ్గరికి గౌతమ్ వచ్చి ఆట పట్టిస్తాడు. వెంటనే రిషి కనుక్కొని గౌతమ్ (Gautham) ను పిలుస్తాడు. ఇక కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
 

610

ఇక రిషి (Rishi) గౌతమ్ ను (Gautham) ఉంటావా వెళ్తావా అని అడిగేసరికి.. ఓ అమ్మాయి తనను ఉండేలా చేస్తుందని అంటాడు. రిషి తల పట్టుకుంటూ ఇంకా మారలేదా రా నువ్వు అని  సరదాగా అంటాడు.
 

710

తనకు ఓ ఆక్సిడెంట్ లో అమ్మాయి కనిపించిందని వసు (Vasu) గురించి, తన అందం గురించి రిషితో వివరిస్తాడు. ఇక దూరం నుంచి రిషి (Rishi) వసు ను గమనించి తనను రాకుండా చేస్తాడు. వసు లోపలికి వెళ్లాలి అని అనటంతో సార్ ఇప్పుడు ఎవరని రావద్దన్నాడని అంటాడు అటెండర్.
 

810

ఇక వసు (Vasu)  తనను కావలని వెనక్కి పంపిస్తున్నాడని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక గౌతమ్ తో (Gautham) టూర్ ప్లాన్స్ గురించి అడుగుతాడు. ఆ అమ్మాయి ని చూశాక ఎటువంటి ప్లాన్స్ లేవని ఇప్పుడు మొత్తం ఆ అమ్మాయే ప్లానింగ్ అని అంటాడు.
 

910

రిషి (Rishi) కూడా రాసి ఉంటే దక్కుతుందని అంటాడు. గౌతమ్ ను తన ఇంట్లో ఉండమని చెబుతాడు. ఇక వసు జగతి వాళ్ళ దగ్గరికి వెళ్లగా ఏం జరిగిందని మహేంద్ర వర్మ, జగతి (Jagathi) అడుగుతారు. సార్ వెనక్కి పంపించాడని చెబుతుంది.
 

1010

ఎలాగైనా గట్టిగా అడగాలి అని వాళ్ళతో చర్చలు చేస్తుంది. కారులో రిషి, గౌతమ్ (Gautham) ఇంటికి వెళ్తుండగా గౌతమ్ పదేపదే వసు (Vasu) గురించి మాట్లాడుతాడు. దారిలో వసు కనిపించటంతో గౌతమ్ కారు ఆపించి వసుకు రిషి కారులో లిఫ్ట్ ఇస్తాడు.

click me!

Recommended Stories