ఈరోజు ఎపిసోడ్ లో వసు రిషికి కాఫీ ఇవ్వగా కాఫీ తాగి బాగుంది అని అంటాడు రిషి. అప్పుడు వసుధార ఇలా బయటకు వచ్చి కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా సార్ అని అనడంతో నీతో ప్రతి ఒక్కటి బాగుంటుంది వసుధార కానీ అవి శాశ్వతం కాదు కదా అని మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడు వసుధార ఏంటి ఎండీ గారు ఆలోచిస్తున్నారు అనడంతో మాటిమాటికీ అలా పిలవకు అంటాడు రిషి. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు కలిసి ఒక ఊరికి వెళ్తారు. అప్పుడు వసుధార ఊర్లో వాళ్లకు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వివరిస్తూ ఉంటుంది. నా పేరు వసుధార, ఈయన రిషి సార్ జెంటిల్మెన్ అని అంటుంది. రిషి సార్ అంటే మామూలు వ్యక్తి కాదు గొప్ప వ్యక్తి ఈ డీబీఎస్టీ కాలేజ్ ఎండి మై డార్లింగ్ అని అంటుంది.