'పఠాన్' ప్రెస్ మీట్ లో షారుఖ్ కి దీపికా ఘాటైన ముద్దు.. ఆఫ్ స్క్రీన్ లో అదిరిపోయే కెమిస్ట్రీ, వైరల్ ఫొటోస్

First Published Jan 30, 2023, 10:11 PM IST

కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. బాలీవుడ్ బాద్షాకి సరైన కమర్షియల్ చిత్రం పడితే బాక్సాఫీస్ జాతర ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. ఐదురోజుల్లోనే పఠాన్ చిత్రం 500 కోట్లకి పైగా వసూళ్లతో మామూలు రచ్చ చేయడం లేదు.

కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. బాలీవుడ్ బాద్షాకి సరైన కమర్షియల్ చిత్రం పడితే బాక్సాఫీస్ జాతర ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది.

ఐదురోజుల్లోనే పఠాన్ చిత్రం 500 కోట్లకి పైగా వసూళ్లతో మామూలు రచ్చ చేయడం లేదు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో, యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతోంది. 

ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, కెజిఎఫ్ 2 చిత్రాల రికార్డులని అదిమిస్తోంది అంటే ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ దక్కుతోందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో వివాదాల నడుమ జనవరి 25న ఈ చిత్రం విడుదలయింది. షారుఖ్, దీపికా జంటగా నటించగా.. జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా నటించాడు. 

పఠాన్ చిత్రానికి టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుండడంతో నేడు చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి దీపికా పదుకొనె ముద్దమందారం లాగా అందంగా.. హాట్ గా ముస్తాబై వచ్చింది. ఆమె ధరించిన గౌన్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. 

క్లీవేజ్ అందాలతో అట్రాక్ట్ చేస్తూ దీపికా వేదికపై కనిపించడంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే వేదికపై దీపికా,షారుఖ్ కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. దీపిక.. షారుఖ్ విషయంలో తీసుకుంటున్న కేరింగ్ అంతా ఇంతా కాదు. అలాగే షారుఖ్ కు ప్రేమగా ఒక ముద్దు కూడా ఇచ్చింది. 

ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆఫ్ స్క్రీన్ లో ఈ రేంజ్ కెమిస్ట్రీ ఏంటి బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనె ఒక రేంజ్ లో అందాలు ఒలకబోసింది. 

పాటల్లో బికినిలో దర్శనం ఇస్తూ గ్లామర్ ప్రియులని ఆకట్టుకుంది. ఓ సాంగ్ లో మితిమీరిన అందాల ప్రదర్శన వల్ల ఈ చిత్రంపై వివాదాలు మొదలయ్యాయి. హిందూ సంఘాలు, భజరంగ్ దళ్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పఠాన్ ప్రదర్శనని అడ్డుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. కానీ అవేమీ ఈ చిత్ర విజయానికి అడ్డు కాలేదు. 

click me!