Guppedantha Manasu: మార్కులు కొట్టేయడానికి కాఫీ తెచ్చిన సాక్షి.. షేర్ చేసుకొని తాగిన రిషీ, వసు!

Published : Jul 15, 2022, 08:48 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా మంచి ప్రేమ కథతో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: మార్కులు కొట్టేయడానికి కాఫీ తెచ్చిన సాక్షి.. షేర్ చేసుకొని తాగిన రిషీ, వసు!

 ఈరోజు ఎపిసోడ్ రిషి(rishi), వసు జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వసు వేసిన పూలదండని తన మెడలో వేసుకుని వసు నీ పదేపదే గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే వసు రిషి రూమ్ దగ్గరికి వచ్చి నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వసుధార రూమ్ కి వెళ్ళగా అక్కడ సాక్షి,వసు(vasu) మొబైల్ తీసుకుని రిషి ఫోటో ని చూస్తుంది. అప్పుడు సాక్షి ఏంటి రిషి ఫోటో చూస్తున్నావు అని అనగా వెంటనే వసుధార నా ఫోన్ తీసుకుని ఒక తప్పు చేశావు.
 

26

రెండవది నా ఫోన్ నా ఇష్టం. ఇక మూడవది నేను రిషి(rishi) సార్ ఫోటోలైన చూస్తాను ఎవరి ఫోటోలు అయినా చూస్తాను అది నా ఇష్టం. నాలుగు అనవసరమైన విషయాలలో తలదూషకు అంటూ సాక్షికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వసు. అప్పుడు వసు, నేను ఇప్పుడు రిషి సార్ రూమ్ దగ్గరికి వెళ్లి వచ్చాను అనడంతో సాక్షి(sakshi) కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు వసు, అలా మాటలతో సాక్షిగా బుద్ధి చెబుతుంది. మరుసటి రోజు ఉదయం రిషి ఇంకా వసు నిద్ర లేవలేదా అని ఆలోచిస్తూ ఉంటాడు.
 

36

మరొకవైపు వసు(vasu) నిద్ర లేచి ఏదో వస్తువు గురించి ఏమంత వెతుకుతూ ఉంటుంది  ఇంతలోనే రిషి, వసు రూమ్ కీ వెళ్ళి పడుకున్నావా లేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వసు వైపు అలా చూస్తూ ఉండగా వసు కూడా రిషి వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో రిషి(rishi) వసు కీ దగ్గరగా వెళ్లి తన జడలో ఉన్న పెన్సిల్ ని తీసి వసు చేతిలో పెడతాడు. అప్పుడు రిషి ఎంత అడిగిన కూడా వసు మనసులో మాట చెప్పకుండా లోలోపల దాచుకుంటుంది.
 

46

 నీలో ఏదో మార్పు వచ్చింది అని రిషి(rishi) అడగగా అప్పుడు వసు నా మనసులో మీరు ఉన్నారు ఆ మాట మీద చెప్పాలి అని అనుకుంటున్నాను అని తన మనసులో అనుకుంటుంది. ఇంతలో వసు, నీకు ఒక మాట చెప్పాలి అనీ అనగా అప్పుడు వెంటనే నేను నీకు ఒక మాట చెప్పాలి అని సాక్షిని ఉద్దేశించి మాట్లాడగా అప్పుడు వసు తననే అనుకోగా అప్పుడు రిషి సాక్షి(sakshi) పేరు చెప్పడంతో లోపల సంతోష పడుతుంది.
 

56

 అప్పుడు వసు తన మనసులో మాట చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది. మరొక వైపు సాక్షి, దేవయాని(devayani) ఇద్దరు రిషి విషయంలో ప్లాన్ చేస్తుంటారు. అప్పుడు సాక్షి ని రిషికీ కాఫీ ఇవ్వమని చెబుతుంది. ఇంతలో అక్కడికి ధరణి రాగా వెంటకారంగా మాట్లాడుతుంది. మరొకవైపు గౌతమ్(gautham) ఇంకా కాఫీ తాగలేదు అని రచ్చ చేస్తూ ఉండగా ఇంతలో సాక్షి రిషి కోసం కాఫీ తీసుకొని వస్తుంది.
 

66

అప్పుడు తనకోసమే కాఫీ తెచ్చింది అని గౌతమ్ తాగడంతో సాక్షి(sakshi) తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు కోపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసుధర రావడంతో గౌతమ్ కాఫీ తాగావా అని అడగగా వసు లేదు సార్ కాఫీ తాగాలనిపిస్తుంది తలబద్దలవుతుంది అని అనగా వెంటనే రిషి(rishi) పిలిచి తన కాపీ కప్ ను షేర్ చేసుకోవడంతో సాక్షిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

click me!

Recommended Stories