Guppedantha manasu: వసుకు పువ్వులు ఇచ్చిన రిషి.. వసుధారని ఆటపాటిస్తున్న గౌతమ్, మహేంద్రలు!

First Published Sep 6, 2022, 9:22 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి,వసూని బయటకు తీసుకు వస్తాడు. అప్పుడు ఇద్దరూ మౌనంగా ఉంటారు. ఏదైనా మాట్లాడు వసుధార అని రిషి అనగా,ఏమీ లేదు సార్ చాలా ఆనందంగా ఉన్నాను పరీక్షలు అయిపోయాయి కదా అని అంటుంది వసు.అప్పుడు రిషి, వసుని కళ్ళు మూసుకోమని చెప్తాడు. అప్పుడు వసు కళ్ళు మూసుకున్నప్పుడు రిషి వెళ్లి పువ్వులు తెస్తాడు. ఏంటి సార్ నాకోసం పువ్వులు తెచ్చారా అని వసుధర అడిగినప్పుడు రిషి ఇవి పువ్వులు మాత్రమే కాదు వాసుధార.
 

నా ప్రశ్నలు కూడా,నాకు చాలా ప్రశ్నలున్నాయి అవన్నీ తీరిస్తేనే ఈ పువ్వులు నీకు దక్కుతాయి అని అంటాడు. అప్పుడు రిషి ఒక పువ్వు ఇచ్చి, నాకు ప్రేమించడం రాదు వసుధారా, నేను షికారులకు అని ,సినిమాలు కొని తీసుకెళ్లలేను అని అంటాడ. సర్ నాకు అవి ఏమీ వద్దు అని అంటుంది వసుధర. అప్పుడు రిషి ఇంకొక పువ్వు ఇచ్చి, నేను వెంటనే నిర్ణయాలు తీసుకుంటాను వసుధార, సమయం తీసుకోను అని అనగా,ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు అవే సార్ అని రెండో పువ్వు తీసుకుంటుంది.
 

రిషి మూడో పువ్వు ఇస్తూ,నేను అలుగుతాను వాసుదార  అని అనగా అలకలో ప్రేమ ఉంటుంది కదా సార్,ఇంక మీరు ఏమి చెప్పొద్దు. నేను మిమ్మల్ని మీలాగా ప్రేమిస్తున్నాను ఇప్పుడు ఈ కారణాలు ఏమీ వద్దు అని చెప్పి పువ్వులు అని తీసుకుంటుంది.మనసులో ఆరోజు సాక్షి అన్నమాటలకు ఇప్పుడు బాధపడుతున్నట్టున్నారు అనుకొని,మీరు ఎవరి మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు సార్. నాకు తెలుసు మీ విలువ, మీ విలువ తెలిసిన వాళ్ళు ఎవరూ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఇష్టపడరు సాక్షి మాటలు పట్టించుకోవద్దు అని చెప్తుంది.
 

అప్పుడు రిషి, ఎందుకో తెలియదు వసుధార, చిన్నప్పటినుంచి నాకు ఇష్టమైన వాళ్ళందరూ నా దగ్గర నుంచి దూరమైపోతున్నారు అని జగతి తనని వదిలి వెళ్ళిపోయే సంఘటన గుర్తు చేర్చుకుంటాడు. వెళ్లిపోయిన వాళ్ళ గురించి ఎందుకు సార్,మీతో ఉన్న వాళ్ల గురించి ఆలోచించండి. వాళ్ళు మీతో ఎప్పటికీ ఉంటారు అని అంటుంది వసు. అప్పుడు వాళ్ళిద్దరూ మొక్క జొన్న తింటూ ఉంటారు.ఈ పాప్ కార్న్ చాలా బాగుంది సార్ అని అంటుంది వసు. అప్పుడు రిషి సరే పరీక్షలు అయిపోయాయి కదా తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడగగా, నేను ఐదు నిమిషాలకోసారి నిర్ణయం మార్చుకోను సార్. 
 

నాకు మీలాగా, జగతి మేడం లాగా పంతులమ్మ అవ్వాలని ఉన్నది నేను అదే అవుతాను అంటాది. సరే వసుధార, నాకు తెలిసిన కొన్ని కాలేజెస్ కూడా నేను కనుక్కుంటాను అలాగే కార్లో ఇంకొక పాప్ కార్న్  ప్యాకెట్ పెట్టాను తీసుకువెళ్ళు అని అంటాడు రిషి. ఆ తర్వాత సీన్ లో గౌతం, జగతి మహీంద్రాలు వసు ఇంటి ఎదురుగుండా నించొని ఉంటారు. అప్పుడు మహేంద్ర, ఏంటి జగతి వీళ్ళు ఇంకా రాలేదు అసలు ఎక్కడికి వెళ్లి ఉంటారు.ఇద్దరు జంట పక్షులుగా తిరిగి వస్తారా? కనీసం ఫోన్ చేద్దామా ఎక్కడున్నారో  అని అనగా ఫోన్ చేసినా వాళ్ళు ఎప్పుడు నిజం చెప్పారు అని అంకుల్ అని అంటాడు  గౌతమ్. 
 

ఇంతలో వసు అక్కడికి వస్తుంది.జంట గ వస్తారు అనుకుంటే ఒక్కత్తే వస్తుందెంటి అని అనుకుంటారు వాళ్లు. అప్పుడు వసు వాళ్ళు చూసి బయట ఉండిపోయారా మేడం ఫోన్ చేయాల్సింది కదా లోపలికి రండి అని లోపలికి తీసుకు వెళ్తుంది. అప్పుడు వసు వాళ్ళ ముగ్గురికి మొక్క జొన్న ఇస్తుంది. ఈ పాప్ కార్న్ లో ఏదో కొత్త రుచి కనిపిస్తుంది దీన్ని రిషి తెచ్చాడా అని అడగగా అవును అని అంటుంది వసు. అప్పుడు వాళ్ళ ముగ్గురు నవ్వుకుంటారు ఆ తర్వాత సీన్లో రిషి కార్లో వెళ్తుండగా పక్క సీట్లో పాప్ కార్న్ గింజలు పడిపోయి కనిపిస్తుంది. వసుధాలతో ఉన్న నిమిషాలు చాలా సంతోషంగా ఉన్నాయి అని అనుకుంటాడు. వెనక తిరిగి చూసేసరికి వసు తన బ్యాగ్ ని వదిలేస్తుంది. 
 

ఇంతలో వసు ఇంట్లో ఎవరో తలుపు కొడతారు. పక్కింటి పిల్లలు ఆడుకోవడానికి వస్తుంటారు సార్ వాళ్ళు ఏమో అని వసు తలుపు తీసేసరికి అక్కడ రిషి ఉంటాడు. బ్యాగ్ మర్చిపోయావు అని లోపలికి వస్తాడు రిషి. అప్పుడు వాళ్ళ ముగ్గురిని చూసి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా నువ్వెందుకు ఇక్కడున్నావు అయినా చాలా బాగుంది పాప్ కార్న్, ఎక్కడి నుంచి తెప్పించావు మాకు కూడా తెప్పిస్తావా?మాకు అదృష్టం ఉందా అని మహేంద్ర అంటాడు. అప్పుడు కారులో బ్యాగ్ మర్చిపోయి వాసుధర అని చెప్పి, బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రిషి. అప్పుడు రిషి, వసుకి బాయ్ అని మెసేజ్ పెడతాడు. పక్కన ఉన్న గౌతమ్, మహేంద్ర,జగతి లు సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!