సమంత డబుల్‌ ట్రీట్‌.. ఓ వైపు రాజ్‌పుత్‌ రాణి, మరోవైపు ప్రేతాత్మ.. ఫ్యాన్స్ కి పండగే

Published : Sep 06, 2022, 07:39 AM ISTUpdated : Sep 06, 2022, 12:55 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత విలక్షణమైన ఆలోచనలతో ముందుకు సాగుతుంది. కెరీర్‌ పరంగానూ ఆమె వెళ్తున్న తీరు షాక్‌కి గురి చేస్తుంది. లేటెస్ట్ సమాచారం ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా చేస్తుండటం విశేషం. 

PREV
16
సమంత డబుల్‌ ట్రీట్‌.. ఓ వైపు రాజ్‌పుత్‌  రాణి, మరోవైపు ప్రేతాత్మ.. ఫ్యాన్స్ కి పండగే

సమంత(Samantha) అంటే అభిమానులకు ఓ వ్యసనంలా తయారవుతుంది. హీరోలకున్న ఫాలోయింగ్‌ ఆమె సొంతం కావడం విశేషం. ఆమెని వెండితెరపై చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌లపై ఒక్క సమంతని చూస్తే పండగ చేసుకునే ఫ్యాన్స్ ఇద్దరు సమంతలను చూస్తే ఇక సెలబ్రేషన్సే అని చెప్పడంలో అతిశయెక్తి లేదు. తాజాగా అది మరోసారి తెరరూపం దాల్చబోతుంది. 
 

26

సమంత ఇప్పటికే `మనం`లో రెండు పాత్రల్లో మెరిసింది. అలాగే తమిళంలో `10ఎండ్రాతుకుల్లా` చిత్రంలో డ్యుయెల్‌ రోల్‌ చేసి మెప్పించింది. ముచ్చటగా మూడోసారి ఆమె ద్విపాత్రాభినయం(Samantha Dual Role) చేయబోతుందట. అయితే ఈ సారి బాలీవుడ్‌లో డ్యూయెల్‌ రోల్‌ చేయబోతుండటం విశేషం. సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ ఓ వెబ్‌సిరీస్‌తోపాటు ఆయుష్మాన్‌ ఖురానాతో ఓ సినిమా చేయబోతుంది. 
 

36

ఆయుష్మాన్‌ ఖురానాతో చేయబోయే సినిమాలో సమంత ద్విపాత్రాభినయం చేయబోతుందని తెలుస్తుంది. రాజస్థాన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే జానపద కథతో ఈ చిత్రం రూపొందుతుందని, ఇందులో సమంత రాజ్‌పుత్‌ రాణిగా, అలాగే ప్రేతాత్మగా ఆమె కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియా వైరల్ అవుతుంది. సమంత డబుల్‌ ట్రీట్‌ అంటూ వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. 
 

46

దీంతోపాటు సమంత మొదటగా ఓ వెబ్‌సిరీస్‌ చేయబోతుంది. రస్సో బ్రదర్స్ రూపొందించిన `సిటాడెల్‌`ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో వరుణ్‌ ధావన్‌తో కలిసి నటిస్తుంది సమంత. అందుకోసం సామ్‌ మార్షల్‌ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటుందట. అమర్‌ కౌశిక్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన అంతకు ముందు `స్త్రీ` చిత్రాన్ని తెరకెక్కించారు. సో.. బాలీవుడ్‌ ఎంట్రీనే ఇలా రెండు భిన్నమైనా, మైండ్‌ బ్లోయింగ్‌ స్టోరీస్‌తో ఎంట్రీ ఇవ్వడం విశేషంగా చెప్పొచ్చు. ఇది ఫ్యాన్స్ ని ఫుల్‌ ఖుషీ చేసే వార్త కావడం విశేషం. 
 

56

సమంత ఇప్పుడు తెలుగు చేస్తున్న మూడు సినిమాలు పాన్‌ ఇండియా లెవల్‌లోనే తెరకెక్కుతున్నాయి. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు `యశోద`, `శాకుంతలం` మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్స్ జరుపుకుంటున్నాయి. ఈ నెల 9న `యశోద` టీజర్‌ రాబోతుంది. దీంతోపాటు విజయ్‌దేవరకొండతో కలిసి `ఖుషి` చిత్రం చేస్తుంది సామ్‌. అలాగే ఓ ఇంటర్నేషనల్‌ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వీటితోపాటు మరో రెండు బాలీవుడ్‌ సినిమాలకు కమిట్‌ అయినట్టు సమాచారం. 
 

66

సమంత ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తుంది. తన విడాకులకు సంబంధించిన విషయాలు తరచూ హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. లేటెస్ట్ గా సమంత డాడీ పంచుకున్న పెళ్లినాటి ఫోటోలు వైరల్‌ అయ్యాయి. మరోవైపు ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందని, ఇంకోవైపు గర్భసంచి తొలగించారనే వార్తలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories