Guppedantha manasu: షార్ట్ ఫిలింలో గౌతమ్ స్థానంలో రిషి.. ఇది దారుణమైన మోసం అంటూ?

Navya G   | Asianet News
Published : Feb 28, 2022, 11:37 AM IST

Guppedantha manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు.(Guppedantha manasu). సరికొత్త కథనంతో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ లో ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం..  

PREV
19
Guppedantha manasu: షార్ట్ ఫిలింలో గౌతమ్ స్థానంలో రిషి.. ఇది దారుణమైన మోసం అంటూ?

రిషి, వసుధర ను ఎత్తుకొని తాడును అందుకోవడానికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇక గౌతమ్ టీ తీసుకొని  అక్కడికి వచ్చి ఇద్దరినీ చూసి షాక్ అవుతాడు. తాడు తీస్తున్న  వసుధర ను చూసి రిలాక్స్ అవుతాడు గౌతమ్. రిషి ఇలాంటి సాహసాలు ఎందుకు చేస్తావు.
 

29

ఎవరికైనా చెప్తే సహాయం చేస్తారు కదా అని వసుధరకు చెప్తాడు. గౌతమ్ టీ ని వసుధరకు తాగమని ఇస్తాడు.రిషి నాకు టీ ఇవ్వు అని అడిగితే నేను నీకు టీ ఇవ్వను అని గౌతమ్ అనడంతో వసుధర చేతిలోని టీ గ్లాస్ ను తీసుకొని తాగుతాడు.మినిస్టర్ గారు వస్తున్నారు అని చేప్పడం తో తాగిన టీ గ్లాస్ ను గౌతమ్ కి ఇచ్చి వెళతాడు.
 

39

 రిషి,గౌతమ్,వసుధర మిగతా వారందరూ కూడా మినిస్టర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మినిస్టర్ గారు రావడంతో పువ్వులతో స్వాగతం చెప్తారు. మినిస్టర్ రిషి ని పొగుడుతూ ఇంత చిన్న వయసులోనే అద్భుతాలు చేస్తున్నావ్ అంటాడు. ఇక అందరూ ఫిలిం చూడడానికి వెళ్తారు. మినిస్టర్ నీ కాలేజ్ గురించి, నీ గురించి చెప్పాలి అంటే ఒక అద్భుతం అంటాడు.
 

49

 జగతి, వసుధర ను వేదిక దగ్గరే ఉండమని నేను వెళ్లి షార్ట్ ఫిలిం ఒకసారి చెక్ చేసుకుని వస్తాను అని చెప్తుంది. రిషి సంతోషంగా ఉండడం చూసి మురిసి పోతూ ఉంటుంది జగతి. ఇక జగతికి దేవయాని ఎదురుపడి ఏంటి ఇంత సంతోషంగా,ఉత్సాహంగా ఉన్నావు అంటుంది.
 

59

జగతి పదిమందికి మేలు చేస్తే ఉత్సాహంగానే ఉంటారు అదే చెడు చేయాలని ప్రయత్నిస్తే పెదాల మీద చిరునవ్వు కూడా ఉండదు ఈ విషయం గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. దేవయాని ఎవరిని చూసుకుని ఇంతలా రెచ్చిపోతున్నావ్ అంటే నా కొడుకు రిషిని, నా భర్తను చూసుకుని అని సమాధానం ఇస్తుంది.
 

69

ఇక జగతి నాకు కొంచెం పని ఉంది అని వెళుతూ ఉంటుంది. గౌతమ్ రండి లోపలికి పెద్దమ్మ అని పిలుస్తాడు మనవాళ్లంతా కూడా ఇలా ఒక చోట ఉండటం చాలా బాగుంది కదా అని అంటాడు. దేవయాని  మాత్రం జగతి మన ఫ్యామిలీ ఏంటి అన్నట్టుగా మాట్లాడుతుంది.ఇక దేవయాని, ధరణి, గౌతమ్ లోపలికి వెళుతూ ఉంటారు. దేవయాని ఏదో ప్లాన్ చేసినట్టుగా చూపిస్తారు.
 

79

 ఇక రిషి, వసుధారా కు జగతి మేడమ్ ని తొందరగా ప్రోగ్రాం స్టార్ట్ చేయమని మెసేజ్ చేస్తాడు. దాంతో జగతి ప్రోగ్రాం ని స్టార్ట్ చేస్తుంది. షార్ట్ ఫిలిమ్ ను చూపిస్తారు. షార్ట్ ఫిలింలో గౌతమ్ ఉండాల్సిన పాత్రలో రిషిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. గౌతమ్ ఏంటి ఇది అన్యాయం కదా అని వసుధరని అడుగుతాడు. వసుధారా మాత్రం షార్ట్ ఫీలిం పూర్తి  అయ్యాక మాట్లాడదాం సార్ అని అంటుంది.
 

89

మినిస్టర్ గారు కూడా రిషిని షార్ట్ ఫిలిం లో ఉన్నందుకు మెచ్చుకుంటారు. ఇక దేవయాని రిషి, వసుధరలను షార్ట్ ఫిలిం లో చూసి మండిపోతూ ఉంటుంది. రిషి,వసుధార ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. గౌతమ్ మాత్రం కోపంగా రిషిని చూస్తాడు షార్ట్ ఫిలింలో వసుధార పిల్లలకు సూ..చ..న.. గురించి చెబుతూ ఉంటుంది. ఇక దేవయాని ఒక న్యూస్ రిపోర్టర్ ను సెట్ చేసి ఉంటుంది.
 

99

ఆ న్యూస్ రిపోర్టర్ జగతి వ్యక్తిగత విషయాలను అడుగుతూ మీ భర్త ఎవరు, మీ సంతానం ఎవరు, మీ సంతానం మీకు పెళ్లి కాకముందే పుట్టారని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో జగతి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉంటుంది. ఇక మహేంద్ర నేను నీ భర్త గా చెప్తున్నాను అగు అని అందరి ముందు అనడంతో జగతి ఆగిపోతుంది. మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతోందో తెలుసుకోవాల్సిందే

click me!

Recommended Stories