రష్మిక మందన్నకు కౌంటర్ ఇచ్చిన రిషబ్ శెట్టి, మరోసారి బయటపడ్డ విభేదాలు

First Published Jan 1, 2023, 4:06 PM IST

కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ సాధించాడు రిషబ్ శెట్టి. అయితే కన్నడ నాట స్టార్ హీరోయిన్ రష్మికకు.. రిషబ్ శెట్టికి మధ్య బేదాబిప్రాయాలు సంగతి తెలిసిందే. రీసెంట్ గా మరోసారి  రష్మికకు  స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు రిషబ్. 

Image: Rishab Shetty in Kantara trailer Youtube

కన్నడ నాట నంచి  పాన్ ఇండియా సినిమాలు సత్తా చాటుతున్నాయి. రీసెంట్ గా కాంతార సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంత గుర్తింపు తెచ్చుకుంది తెలిసిన పనే. ఈ సినిమాతో  మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు రిషబ్ శెట్టి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈయన పేరు మారు మోగిపోతుంది.

ఈ సినిమా తరువాత స్టార్ హీరోయిన్  రష్మికతో..  రిషబ్ శెట్టికి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అంతకు ముందే ఉన్న వివాదాలు ఈ సినిమా టైమ్ లో ఇంకాస్త పెరిగిపోయాయి. రిషబ్ శెట్టి తమ్ముడు.. రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ అయిపోయిన తరువాత ఆమె బ్రేకప్ చేసుకోవడంతో.. రిషబ్ ఫ్యామిలీతో రష్మికకు మధ్య బంధం చెడింది. 
 

కాంతార సినిమా రిలీజ్ తరువాత కూడా ఈసినిమా చూడలేదంటూ.. ఆమె చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదం బయటకు వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య ఇదే వివాదం ఇంకా కొనసాగుతుందని తాజాగా రిషబ్ శెట్టి చేసిన ట్వీట్ ను బట్టి అర్థమవుతుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కిరిక్ పార్టీ.

ఈ సినిమా  డిసెంబర్ 31 కి రిలీజ్ అయ్యి 6 సంవత్సరాలు పూర్తి కావడంతో రిషబ్ శెట్టి ఈ సినిమా గురించి గుర్తుచేసుకుంటూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ రష్మికకు పరోక్షంగా కౌంటర్ కూడా ఇచ్చాడు రిషబ్.  కిరిక్ పార్టీ విడుదలై ఆరు సంవత్సరాలు పూర్తి కావడంతో రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..
 

 మా సినిమా విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ మా కోసం మీరు చేసిన సందడి థియేటర్లో వేసిన విజిల్స్ ఇప్పటికీ మా చెవులలో మారుమోగుతున్నాయి.మమ్మల్ని మరోసారి ఆ రోజుల్లోకి తీసుకువెళ్లాయి. ఈ వేడుకలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ  ట్విట్ చేశారు. రిషబ్ శెట్టి చేసినటువంటి ఈ ట్వీట్ కి హీరో రక్షిత్ శెట్టి, నిర్మాణ సంస్థ పేరు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ లోకనాథ్ ను ట్యాగ్ చేశారు. కాని రష్మికను మాత్రం ట్యాగ్ చేయలేదు. 
 

ఈ సినిమా హిట్ లో.. హీరో పాత్ర ఎంత ఉందో.. హీరోయిన్ పాత్ర కూడా అంతే ఉంది. అటువంటిది. ఈ సినిమాలో హీరోయిన్ గా  నటించిన రష్మికను టాగ్ చేయకుండా ఉండడంతో మరోసారి రష్మికకు ఈట్వీట్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంతే కాదు ఈ  ట్వీట్ వైరల్ అవుతుంది.

click me!