Lasya New Year 2023 Celebrations : బేబీ బంప్ తో యాంకర్ లాస్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్... వైరల్ గా ఫోటోలు 

Published : Jan 01, 2023, 03:49 PM ISTUpdated : Jan 04, 2023, 03:35 PM IST

లాస్య న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. బేబీ బంప్ తో భర్తతో రొమాంటిక్ పోజులివ్వగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు ఈ లవ్లీ కపుల్ కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.   

PREV
17
Lasya New Year 2023 Celebrations : బేబీ బంప్ తో యాంకర్ లాస్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్... వైరల్ గా ఫోటోలు 
Anchor Lasya


ఇటీవల లాస్య తన ప్రెగ్నెన్సీ ప్రకటించారు. సెకండ్ చైల్డ్ ని కనబోతున్నట్లు వెల్లడించారు. లాస్యకు నెలలు దగ్గర పడిన నేపథ్యంలో బేబీ బంప్ తో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. 2023లో లాస్య దంపతుల జీవితాల్లోకి మరో బిడ్డ రానుంది. 
 

27
Anchor Lasya


ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య (Lasya) బిగ్ బాస్ షోతో మరింత పాప్యులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు. 

37
Anchor Lasya


హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండిపెడుతూ ఉండేవారు. ఇక తోటి కంటెస్టెంట్స్ తో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. అయితే ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకడైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 (Bigg boss telugu 4) టైటిల్ అందుకున్నారు. 

47
Anchor Lasya

అలాగే ఆమెది ఫేక్ స్మైల్ అంటూ ప్రేక్షకులు కామెంట్ చేసేవారు. లాస్య గేమ్ లో నిజాయితీ లేదని, ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కారణంగా లాస్య ఫైనల్ కి వెళ్లలేకపోయారు. టైటిల్ రేసులో ఉంటుందనుకుంటే లాస్య అంచనాలు అందుకోలేదు.

57
Anchor Lasya

ఇక ఈ షో వేదికగా లాస్య కొన్ని పర్సనల్ విషయాలు వెల్లడించారు. తన ప్రేమ, పెళ్లి... దానికి ఎదురైన అడ్డంకుల తెలియజేశారు. లాస్య ప్రేమ వివాహం చేసుకోగా, ఆమె తండ్రి అంగీకరించలేదు. దీంతో ఆమె చాలా కాలం పేరెంట్స్ తిరస్కరణకు గురయ్యారు. తమకు ఓ బిడ్డ పుట్టాక పేరెంట్స్ దగ్గరయ్యారని లాస్య చెప్పుకొచ్చింది.

67
Anchor Lasya

ఆమె హౌస్ లో ఉండగా భర్త, కొడుకు జున్ను రావడం జరిగింది. ప్రస్తుతం జున్నుకు నాలుగైదేళ్ల వయసు ఉంటుంది. ఇక రెండో బిడ్డను ఎప్పుడు కంటావ్ అని సన్నిహితులు, చుట్టాలు అడుగుతున్నారట.

77
Anchor Lasya

ఈ ప్రశ్న అడిగే వాళ్లకు చెంప దెబ్బే నా సమాధానం అని... లాస్య అప్పట్లో ఒక వీడియో పోస్ట్ చేయడం విశేషం. అది జరిగి కొన్ని నెలలు అవుతుండగా... లాస్య మరోసారి తల్లి అయ్యారు.

click me!

Recommended Stories