రిషబ్ శెట్టి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా? టాలీవుడ్ పై కన్నేసిన కాంతార హీరో..

Published : Nov 22, 2025, 06:20 PM IST

కాంతార సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి, టాలీవుడ్ పై కన్నేశాడు. తెలుగులో స్టార్ హీరోకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడట. ఇంతకీ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయబోయే పాన్ఇండియా హీరో ఎవరో తెలుసా? 

PREV
15
టాలీవుడ్ పై కన్నేసిన కాంతార హీరో..

రీసెంట్ గా కాంతార చాప్టర్ 1 సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృస్టించాడు రిషబ్ శెట్టి. తానే హీరోగా, డైరెక్ట్ చేస్తూ తెరకెక్కించిన కాంతార, కాంతార ఛాప్టర్ 1 సినిమాలకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే 1000 కోట్ల మార్క్ టచ్ చేయాలనుకున్న రిషభ్ ఆశ మాత్రం తీరలేదు. అయితే హీరోగా, దర్శకుడిగా రెండు రకాలుగా తన టాలెంట్ ఏంటో చూపించాడు రిషబ్ శెట్టి. పాన్ ఇండియా సినిమాలతో దుమ్మురేపిన రిషశ్..ఇక టాలీవుడ్ పై దృష్టిపెట్టాడు. ఇక్కడ నటుడిగా, దర్శకుడిగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈక్రమంలోనే పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేయడం కోసం తెలుగు హీరోను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడు కాంతార.

25
టాలీవుడ్ లో రిషబ్ ప్రాజెక్ట్స్..

ఇప్పటికే టాలీవుడ్ లోపలు సినిమాల్లో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమాలో హనుమంతునిగా రిషబ్ పోస్టర్ కూడా వైరల్ అయ్యింది. ఈసినిమాతో పాటు పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కోసం కన్నడ స్టార్ ను కలుస్తున్నారట తెలుగు మేకర్స్. ఈక్రమంలో నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని రిషబ్ శెట్టి ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకోసం భారీగానే ప్లాన్ చేశాడు కాంతార దర్శకుడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం కోసం రిషబ్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం

35
ఎన్టీఆర్ హీరోగా రిషబ్ శెట్టి సినిమా?

దర్శకుడిగా తనను తాను ఫ్రూ చేసుకున్న రిషబ్ శెట్టి.. టాలీవుడ్ హీరో ఆయన జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే రిషబ్ శెట్టి తన కొత్త కథను జూనియర్ ఎన్టీఆర్‌కు వినిపించినట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి చెప్పిన కథ జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా నచ్చినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ కాంబినేషన్ సినిమా వెంటనే స్టాట్ అవుతుందా లేదా అనేది సందేహం. మరో రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయినప్పటికీ, రిషబ్ శెట్టి–ఎన్టీఆర్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

45
తారక్ తో రిషబ్ శెట్టి స్నేహం. .

రిషబ్ శెట్టికి ఎన్టీఆర్ కు మంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్ అమ్మమ్మ గారు ఊరు రిషబ్ శెట్టి ఊరు ఒక్కటే. తారక్ కన్నడ కూడా చాలా అద్భుతంగా మాట్లాడగలడు. అంతే కాదు చాలా సార్లు కర్నాటక వెళ్లినప్పుడు రిషబ్ తె కలిసి ఎన్టీఆర్ సందడి చేశాడు. ఈక్రమంలో వీరి మధ్య మంచి స్నేహం ఉండటం, కథ బాగుండి, ఎన్టీఆర్ కు నచ్చితే సినిమా చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పైగా రిషబ్ శెట్టి దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. దాంతో తారక్ రిషబ్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

55
రిషబ్ శెట్టి మార్క్ లో సినిమా..?

రిషబ్ శెట్టి సినిమాలు సాధారణంగా సంస్కృతి, భావాలు, గ్రామీణ వైభవం, సహజత్వం వంటి అంశాలతో ఉండేలా రూపొందిస్తారు. కాంతార సిరీస్2 సినిమా ద్వారా ఆయన దాదాపు 750 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టారు. ఈ స్థాయిలో విజయాన్ని అందుకున్న తర్వాత ఆయన నెక్ట్స్ సినిమాలపై సహజంగానే భారీ ఆసక్తి పెరిగింది. రిషబ్ శెట్టి ఈసారి 1000 కోట్ల మార్క్‌ను దాటే మూవీని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. ఎన్టీఆర్ ఒప్పుకుంటే అంతకు మించిన సినిమానే తయారవుతుంది అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. ఒక వేళ ఇది నిజం అయితే.. ఎన్టీఆర్ ఈసినిమా కోసం ఒప్పుకుంటే.. రిషబ్ శెట్టి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడు, కథ ఎలా ఉండబోతుంది, ప్రాజెక్ట్ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories