భార్యాపిల్లలతో 'జై హనుమాన్' హీరో దీపావళి సంబరాలు.. చూడముచ్చటైన కుటుంబం, ఫొటోస్ చూడాల్సిందే

First Published | Nov 2, 2024, 7:14 PM IST

రిషబ్ శెట్టి కుటుంబం ఘనంగా దీపావళి జరుపుకుంది. పూజలో కూర్చున్నప్పుడు కనిపించిన నిజమైన హెయిర్ స్టైల్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. 

కన్నడ చిత్రరంగానికి  చెందిన విభిన్న దర్శకుడు, నటుడు మరియు నిర్మాత అయినటువంటి రిషబ్ శెట్టి ఈ సంవత్సరం దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. 

రిక్కీ సినిమాతో దర్శకత్వం ప్రారంభించిన రిషబ్ శెట్టికి కిరిక్ పార్టీ సినిమా ఆయన కెరీర్ కు టర్నింగ్ పాయింట్. చాలా సినిమాలకు రిషబ్ దర్శకుడు, రచయితగా వ్యవహరిస్తున్నారు.


కాంతార సినిమా సీక్వెల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న డివైన్ స్టార్ రిషబ్ శెట్టి ఇప్పుడు కుటుంబంతో కలిసి ఇంట్లో పూజ చేసి దీపావళి జరుపుకున్నారు.

ఆరెంజ్, పింక్ కలయిక చీరలో ప్రగతి కనిపించారు. పసుపు జుబ్బా, పంచెలో రిషబ్ శెట్టి మెరిశారు. ఈ ఫొటోస్ లో రిషబ్ ఫ్యామిలీ చూడముచ్చటగా ఉంది. 

దీపావళి వేడుకలకు సంబంధించిన కుటుంబ ఫోటోను ప్రగతి శెట్టి అప్లోడ్ చేస్తూ, దీప కాంతి మీ జీవితంలోకి ప్రశాంతత, శ్రేయస్సును తీసుకురావాలని, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

కుటుంబంతో కలిసి పూజ చేస్తున్నప్పుడు రిషబ్ శెట్టి అసలైన హెయిర్ స్టైల్ కనిపిస్తుంది. ఈ లుక్ చూసి నెటిజన్లు థ్రిల్ అయ్యారు. 

Latest Videos

click me!