బిగ్ బాస్ హౌస్ నుండి నయని పావని అవుట్!

First Published | Nov 2, 2024, 7:03 PM IST

9వ వారానికి గాను ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఎలిమినేట్ అయినట్లు సమాచారం అందుతుంది. 
 


మరో వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కంటెస్టెంట్స్ పై సీరియస్ అయ్యాడు. ముఖ్యంగా టాస్క్ లలో టెంపర్ కోల్పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడిన నిఖిల్, ప్రేరణ, గౌతమ్ లకు క్లాస్ పీకాడు. వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మాట్లాడే భాష ముఖ్యమని నాగార్జున కంటెస్టెంట్స్ కి సూచించాడు. 
 

Bigg boss telugu 8

మరోవైపు నామినేషన్స్ టెన్షన్ కొనసాగుతుంది. ఈ వారం ఇంటిని వీడేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది. 9వ వారానికి గాను యష్మి గౌడ, గౌతమ్, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని నామినేట్ అయ్యారు. ఓటింగ్ లో యష్మి ముందంజలో ఉన్నట్లు పలు మీడియా సంస్థల సర్వేలలో తేలింది. ముప్పై శాతానికి పైగా ఓట్లు యష్మికి పడ్డాయట. రెండో స్థానంలో గౌతమ్ ఉన్నాడట. 

ప్రేక్షకుల ఓటింగ్లో టేస్టీ తేజ మూడో స్థానంలో నిలిచాడట. ఈ వారానికి అతడు సేఫ్ అయ్యాడట. ఇక హరితేజ, నయని పావని చివరి రెండు స్థానాల్లో ఉన్నారట. చివరి స్థానంలో ఉన్న హరితేజ ఓటింగ్ మెరుగు పరచుకుని నాలుగో స్థానానికి చేరిందట. అందరి కంటే నయని పావనికి తక్కువ ఓట్లు పోల్ అయ్యాయట. ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడట. నయని పావని బిగ్ బాస్ ఇంటిని వీడిందనేది విశ్వసనీయ సమాచారం. 
 



ఐదు వారాల అనంతరం 8 మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో నయని పావని ఒకరు. ఈమె సీజన్ 7లో కంటెస్ట్ చేసింది. అప్పుడు కూడా రాణించలేదు. కేవలం ఒక్క వారం మాత్రమే హౌస్లో ఉంది. ఆ సమయంలో నయని పావని ఎమోషనల్ అయ్యింది. కన్నీరు పెట్టుకుంది. ఈసారి ఆమె నాలుగు వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉంది. 

నయని పావని ఏ విధంగా కూడా ప్రత్యేకత చాటుకోలేకపోయింది. అది ఆమెకు మైనస్. అందులోను నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వారితో పోల్చితే నయని పావనికి పాపులారిటీ తక్కువ. గౌతమ్ తో ఆమెకు తరచుగా గొడవలు జరుగుతుంటాయి. వీరిద్దరూ గత సీజన్లో కంటెస్ట్ చేసినవారే. కాగా శివాజీ ఈమెకు మద్దతు తెలిపాడు. నయని పావనికి ఓట్లు వేయాలని అభిమానులను కోరాడు. 
 

Bigg boss telugu 8

నయని పావని ఎలిమినేట్ కాని పక్షంలో శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తారనే  ప్రచారం జరిగింది. 10వ వారం కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. నయని పావని కోసం శివాజీ వస్తారంటూ కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరికీ మధ్య మంచి బాండింగ్ ఉంది. నయని పావనికి తండ్రి లేడు. శివాజీని నయని పావని తండ్రిగా భావిస్తుంది. 

ఈ క్రమంలో శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడన్న వార్తలకు బలం చేకూరింది. అయితే నయని పావని ఎలిమినేట్ అయ్యిందని అంటున్నారు. నయని పావని నీ జతగా అనే చిత్రంలో నటించింది. కీలక రోల్ లో కనిపించింది. అలాగే నిహారిక హీరోయిన్ గా నటించిన సూర్యకాంతం మూవీలో ఓ పాత్ర చేసింది. 

నటి హోదాలో నయని పావనికి బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొనే అవకాశం వచ్చింది. సీజన్ 8లో మరోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. కాగా గత వారాల్లో బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, సీత, నాగ మణికంఠ, మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. నయని ఎలిమినేషన్ తో హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. వీరి మధ్య టైటిల్ పోరు సాగనుంది. 

Latest Videos

click me!