మొదటి సినిమానే 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు కళానిధి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో సన్ పిక్చర్స్ మొదటి సినిమాతోనే మంచి లాభాలను ఆర్జించింది. దీని తర్వాత విజయ్ సర్కార్, పెట్టా, నమ్మ విధి పిల్లై, మృగం, జైలర్ వంటి వరుస సినిమాలను నిర్మించారు కళానిథి. ఈసినిమాలకు నెగెటీవ్ టాక్ వచ్చినా.. ఆతరువాత పుంజుకున్న సినిమాలు బోలెడు ఉన్నాయి. ఇక సన్ పిక్చర్స్ పలు చిత్రాలను పంపిణీ చేసింది కూడా.