Shruti Haasan
శృతి హాసన్ ప్రస్తుతం సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఓ ఆన్లైన్ ఛాట్ లో పాల్గొన్న శృతి హాసన్... తాను సింగిల్ అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే శాంతను హజారిక ను వదిలేసినట్లు పరోక్షంగా చెప్పింది.
Shruti Haasan
ముంబై డూడుల్ ఆర్టిస్ట్ శాంతను తో మూడేళ్లకు పైగా సహజీవనం చేసింది శృతి హాసన్. ముంబైలో ఇద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. అతని సహచర్యాన్ని శృతి హాసన్ చాలా ఎంజాయ్ చేసేది. ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది. అతనితో ఉన్న ప్రతి క్షణాన్ని శృతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసేది.
shruti hassan and michael corsale
ఎంతో అన్యోన్యంగా ఉండే శాంతను-శృతి హాసన్ విడిపోయారు. శాంతను కి ముందు శృతి హాసన్ లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో డేటింగ్ చేసింది. దాదాపు వీరు వివాహం చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అతని కోసం శృతి హాసన్ సినిమాలు కూడా చేయడం మానేసింది. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు.
Shruti Haasan
ఒకరిద్దరు హీరోలతో శృతి హాసన్ డేటింగ్ చేశారనే పుకార్లు ఉన్నాయి. మైఖేల్, శాంతను లతో సాగించినట్లు శృతి హాసన్ బహిరంగంగా హీరోలతో చేయలేదు. మరి ఆ వార్తల్లో నిజమెంతో తెలియదు. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్స్ కి బ్రేకప్ చెప్పడానికి ప్రధాన కారణం ఒకటేనట. ఆమెకు వివాహం అంటే ఇష్టం ఉందట. చెప్పాలంటే భయం అట.
కొంత కాలం సహజీనం చేశాక పెళ్లి చేసుకుందామని ప్రియుడు అడిగితే ఆమెకు నచ్చదట. వద్దని చెబుతుందట. పెళ్లి కావాలని ఒత్తిడి చేస్తే వదిలేస్తుందట. శాంతను కి గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణం ఇదేనట. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ పెళ్లి అంటే నాకు భయం అని చెప్పడం విశేషం. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి ఆమె ఓల్డ్ కామెంట్స్ ఊతం ఇస్తున్నాయి. కలిసి జీవించడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటుందట...