ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రిచ్ హీరోలు చాలామంది ఉన్నారు. కోట్ల విలువ చేసే ఖరీదైన వస్తువులు వాడేవారు ఎంతో మంది ఉన్నారు. వారిలో 13 కోట్ల విలువ చేసే వాచ్ వాడుతున్న హీరో ఎవరో తెలుసా?
ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వేల కోట్లు సంపాదించే హీరోలు చాలామంది ఉన్నారు. సినిమాలతో పాటు రకరకాల వ్యాపారాలు చేస్తూ.. వేల కోట్లు సంపాదిస్తున్నారు. కాస్ట్లీ కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, ఖరీదైన వస్తువలను వాడుతూ.. లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియాన్ టాప్ 10 ధనవంతులైన హీరోలలో తెలుగు స్టార్స్ అయిన చిరంజీవి, నాగార్జున కూడా ఉన్నారు. అయితే ఇండియాలోనే రిచ్ హీరో ఎవరో తెలుసా? 13 కోట్ల విలువ చేసే వాచ్ ను వాడుతున్న 60 ఏళ్ల స్టార్ సీనియర్ హీరో ఎవరు?
25
షారుక్ ఖాన్ రెమ్యునరేషన్, ఆస్తి
ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్. దాదాపు 7300 కోట్ల ఆస్తితో ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోగా షారుక్ ఖాన్ నిలిచారు. ఒక్క సినిమాకు ఆయన 200 కోట్లకు పైగా రెమ్యునరేషన తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇండియన్ టాప్ 10 రిచ్ హీరోలలో షారుఖ్ మొదటి స్థానాన్ని సంపాదించాడు.
ఇక తాజాగా ఆయన మరోసారి అంతర్జాతీయ స్టేజ్ పై తన స్టైల్‌తో వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఘనంగా నిర్వహించిన ‘జాయ్ అవార్డ్స్ 2026’ కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. నలుపు రంగు దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై నడిచివచ్చిన షారుఖ్ ఖాన్ ఎప్పటిలాగే తన లుక్‌తో అభిమానులు, అతిథుల దృష్టిని ఆకర్షించారు.
35
13 కోట్ల వాచ్ తో షాక్ ఇచ్చిన షారుక్..
జాయ్ అవార్డ్స్ 2026 వేడుకలో షారుక్ స్పెషల్ గా నిలవడానికి ఆయన చేతికున్న వాక్ కూడా ఓ రీజన్ గా మారింది. షారుక్ చేతిపై కనిపించిన ఖరీదైన వాచ్ అందరి దృష్టిని మరింతగా ఆకట్టుకుంది. బాలీవుడ్ బాద్ షా ధరించిన ఆ వాచ్ అత్యంత అరుదైన రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా సఫైర్ మోడల్‌కు చెందినదని తెలుస్తోంది. ఈ వాచ్ రేటు సుమారుగా 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.. అంటే మన ఇండియాన్ కరెన్సీలో 13 కోట్లకు పైగా ఉంటుంది. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేసిన ఈ వాచ్ కేస్‌పై మొత్తం 54 వజ్రాలను అమర్చారు. అలాగే వాచ్ బెజెల్‌పై 36 నీలమణి రాళ్లను పొదిగారు. కాంతిని బట్టి రంగులు మారే సిల్వర్ అబ్సిడియన్ డయల్ ఈ వాచ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ రోలెక్స్ డేటోనా సఫైర్ మోడల్‌ను కంపెనీ తమ అధికారిక కేటలాగ్‌లో ఎక్కడా ప్రదర్శించదని సమాచారం. ఎక్కడా కనిపించని కారణంగా ఈ వాచ్ ను ‘ఘోస్ట్ వాచ్’ అని కూడా పిలుస్తారు. రోలెక్స్ సంస్థ అత్యంత అరుదైన ఈ వాచ్‌ను తమ VVIP కష్టమర్లకు మాత్రమే ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాచ్‌లు చాలా కొద్ది సంఖ్యలోనే ఉన్నాయని, దీనిని మ్యూజియం గ్రేడ్ కలెక్టబుల్‌గా పరిగణిస్తారని నిపుణులు అంటున్నారు.
55
షారుక్ మనసుకు నచ్చిన వాచ్..
షారుఖ్ ఖాన్ ఈ కాస్లీ వాచ్ ను వేసుకోవడం ఇది మొదటి సారి కాదు.. గతంలో కూడా దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ లో షారుక్ ఈ వాచ్ తో సందడి చేశారు. అంతే కాదు బాద్‌షాకు ఈ వాచ్ చాలా ఇష్టమని తెలుస్తోంది. అత్యంత ముఖ్యమైన ఈవెంట్స్ కు ఆయన పక్కాగా ఈ వాచ్ ను ధరిస్తారట. ఇక సినిమాల విషయానికి వస్తే, షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘కింగ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, సుహానా ఖాన్, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.