
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సి సినిమా.. మరో హీరో దగ్గరకు వెళ్లడం కామన్. పరిస్థితుల ప్రభావం, కథ నచ్చకపోవడం, బిజీ షెడ్యూల్స్ వల్ల కొన్ని కథలు వదిలేసుకుంటుంటారు హీరోలు. వదిలేసిన కథ మరొక హీరో చేసి.. అది బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. అయ్యే అనుకుంటారు. లేదా ఆసినిమా ప్లాప్ అయితే.. హమ్మయ్య అనుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది మహేష్ బాబు , ప్రభాస్ కి. మహేష్ నిర్ణయాన్ని తక్కువ అంచనా వేసిన ప్రభాస్.. కథ బాగుంది, నచ్చిందని మనసు పడి చేసిన సినిమా డిజాస్టర్ అయ్యిందని మీకు తెలుసా?
ఒక హీరో వదిలేసిన సినిమాను మరొక హీరో చేయడంతో డిజాస్టర్‌ను ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా మంది స్టార్ హీరోల కెరీర్ లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. మహేష్ బాబు కూడా ఓ కథను ఇలాగే రిజెక్ట్ చేశాడట.. కానీ అది తనకు నచ్చి.. బాగుంటుందని సినిమా చేశాడట ప్రభాస్. మహేష్ నిర్ణయం అతన్ని డిజాస్టర్ నుంచి కాపాడింది. ప్రభాస్ కెరీర్ ను మాత్రం డేంజర్ లో పడేసింది. ఇంతకీ ఆసినిమా ఏదో కాదు చక్రం. అవును కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన ఈసినిమాను ముందుగా మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడట కృష్ణ వంశీ.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ బిగినింగ్ లో నటించి సూపర్ హిట్ కొట్టిన సినిమా మురారి. ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచిన ఈసినిమా అప్పట్లో మంచి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ప్రతీ పెళ్లి పందిరిలో మురారి సాంగ్ వినిపించాల్సిందే. ఈసినిమా తెలుగులో అంత ప్రభావం చూపించింది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో మరో సినిమా చేయాలనే ఉద్దేశంతో కృష్ణవంశీ చక్రం కథను ఆయనకు వినిపించినట్లు సమాచారం.
అయితే ఆ కథ మహేష్ బాబుకు నచ్చకపోవడంతో ఆయన దానిని వద్దనుకున్నాడట. ఆ పాత్ర తనకు సూట్ అవ్వదని అన్నాడట మహేష్. క్లైమాక్స్ లో చనిపోయే పాత్ర కావడంతో.. మహేష్ కు అది నచ్చలేదట. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇది వైరల్ అయ్యింది.
మహేష్ బాబు రిజెక్ట్ చేసిన తర్వాత కృష్ణవంశీ ఆ కథను మరొక చిన్న హీరోతో చేయాలని అనుకున్నాడట. కానీ అనుకోకుండా ఆ కథను ప్రభాస్ వినడం.. అది రెబల్ స్టార్ కు బాగా నచ్చేసిందట. డైరెక్టర్ వద్దులేండి అని అన్నా.. కథ నాకు బాగా నచ్చింది.. మనం చేద్దాం అని పట్టుబట్టి కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చక్రం’ సినిమాలో నటించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్ పరంగా ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచిన ప్రభాస్ పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది.
చక్రం సినిమా రిజెల్ట్ ఎలా ఉన్నా.. ఈసినిమా చాలామంది యూత్ ఆడియన్స్ కు హాట్ ఫెవరెట్ గా నిలిచింది. చక్రం సినిమాను మనసుతో చూసిన ఆడియన్స్ ఎంతో మంది ఉన్నారు. అంతే కాదు ఈ సినిమాలో చక్రం పాత్రను ప్రభాస్ ప్రాణం పెట్టి నటించాడు. ఆయనలో పూర్తిస్థాయి నటుడిని ఈసినిమా బయటకు తీసిందని చెప్పోచ్చు. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన హీరోలలో, ఆయన సినిమాలో నటించే ముందు, నటించిన తర్వాత నటనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని కృష్ణవంశీ సినిమాల్లో నటించిన ఆర్టిస్టుల నటనలో ఒక పరిణితి కనిపిస్తుందని టాక్ ఉంది.
మొత్తానికి, ప్రభాస్ తన కెరీర్ ప్రారంభ దశలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో నటించి ఒక డిజాస్టర్ సినిమాను ఎదుర్కొన్నాడు. అయితే ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘చత్రపతి’ సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ పూర్తిగా మారిపోయింది.
ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా రాజాసాబ్ తో ఆడియన్స్ ముందకు వచ్చిన ప్రభాస్.. నెక్ట్స్ స్పిరిట్, ఫౌజీ, సలార్ 2, కల్కీ2 లాంటి ప్రాజెక్ట్స్ తో అలరించడానికి రెడీగా ఉన్నాడు.