Age Gap: మన స్టార్ హీరోలకు వారి భార్యల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

Published : Jan 22, 2026, 01:56 PM IST

Age Gap: స్టార్ హీరోల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే కోరిక అభిమానులకు ఎప్పుడూ ఉంటుంది. మరి మన స్టార్ హీరోలకు వారి భార్యలకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో చూద్దామా...

PREV
13
సీనియర్ స్టార్స్....

మన సీనియర్ హీరోలందరూ దాదాపు 3 నుంచి 9 ఏళ్ల వ్యత్యాసం ఉన్న జంటలే.

మెగాస్టార్ చిరంజీవి-సురేఖ.. చిరంజీవి వయసు 70 ఏళ్లు కాగా, సురేఖ వయసు 66 ఏళ్లు. వీరి మధ్య 4 ఏళ్ల వ్యత్సాసం ఉంది.

నందమూరి బాలకృష్ణ- వసుంధర.. బాలయ్య వయసు 65 ఏళ్లు కాగా.. వసుంధర వయసు 62 ఏళ్లు. వీరి మధ్య ఏజ్ గ్యాప్ కేవలం 3 ఏళ్లు మాత్రమే.

వెంకటేష్ - నీరజ: వెంకటేష్ వయసు 65 ఏళ్లు, ఆయన భార్య నీరజ వయసు 58 ఏళ్లు. వీరి మధ్య 7 ఏళ్ల వ్యత్యాసం ఉంది.

అక్కినేని నాగార్జున - అమల (9 ఏళ్ల గ్యాప్)

కింగ్ నాగార్జున , అమల టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాగార్జున వయసు 66 ఏళ్లు కాగా, అమల గారి వయసు 57 ఏళ్లు. వీరిద్దరి మధ్య 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

23
మహేష్ బాబు - నమ్రత

టాలీవుడ్ క్రేజీ కపుల్ మహేష్ బాబు , నమ్రత శిరోద్కర్ జంట చాలా ప్రత్యేకం. ఎందుకంటే మహేష్ బాబు కంటే ఆయన భార్య నమ్రత వయసులో పెద్దవారు. మహేష్ వయసు 50 ఏళ్లు కాగా, నమ్రత వయసు 54 ఏళ్లు. అంటే నమ్రత.. మహేష్ కంటే 4 ఏళ్లు పెద్ద.

 పవన్ కళ్యాణ్ - అన్నా లెజ్నెవా (9 ఏళ్ల గ్యాప్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వయసు ప్రస్తుతం 54 ఏళ్లు. ఆయన భార్య అన్నా లెజ్నెవా వయసు సుమారు 45 ఏళ్లు. వీరి మధ్య 9 ఏళ్ల వ్యత్యాసం ఉంది.

33
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతి (9 ఏళ్ల గ్యాప్)

ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి జంట మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువే. ఎన్టీఆర్ వయసు 42 ఏళ్లు కాగా, ప్రణతి వయసు 33 ఏళ్లు. వీరి మధ్య కూడా 9 ఏళ్ల గ్యాప్ ఉంది. పెళ్లి సమయంలో ప్రణతి వయసు కేవలం 19 ఏళ్లే కావడం విశేషం.

6.అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి: ఐకాన్ స్టార్ బన్నీ వయసు 43 ఏళ్లు, స్నేహ రెడ్డి వయసు 40 ఏళ్లు. వీరి మధ్య 3 ఏళ్ల గ్యాప్ ఉంది.

రామ్ చరణ్ - ఉపాసన: రామ్ చరణ్ వయసు 40 ఏళ్లు కాగా, ఉపాసన వయసు 36 ఏళ్లు. వీరి మధ్య 4 ఏళ్ల వ్యత్యాసం ఉంది.

రానా దగ్గుబాటి - మిహీకా: రానా వయసు 41 ఏళ్లు, మిహీకా వయసు 34 ఏళ్లు. వీరి మధ్య 7 ఏళ్ల గ్యాప్ ఉంది.

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి: ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య ఏజ్ గ్యాప్ చాలా తక్కువ. వరుణ్ వయసు 36 ఏళ్లు, లావణ్య వయసు 35 ఏళ్లు. వీరి మధ్య కేవలం 1 ఏడాది మాత్రమే తేడా ఉంది.

సినిమా ఇండస్ట్రీలో ఏజ్ గ్యాప్ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఈ జంటలు నిరూపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories