ఎపిసోడ్ ప్రారంభంలో ముకుంద కి ఆమె ఫ్రెండ్ ఫోన్ చేసి మురారి ఏమన్నాడు అని అడుగుతుంది. నన్ను అమ్మకి తోడుగా వెళ్ళమన్నాడు అంటే అతను నా ఆప్సేన్సి ని కోరుకుంటున్నాడు. తను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని బాధపడుతుంది ముకుంద. అలాంటిదేమీ జరిగి ఉండదు తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా అతను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు అందుకే అలా చెప్పి ఉంటాడు అని ధైర్యం చెబుతుంది ఆ ఫ్రెండ్.