బ్రా లాంటి బ్లౌజ్ లో రకుల్ ఎద అందాల విందు.. మత్తెక్కించు చూపులతో మతులు చెడగొడుతున్న ఢిల్లీ బ్యూటీ

First Published | Jun 12, 2023, 1:11 PM IST

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) నెట్టింట చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు నయా లుక్ లో మెరుస్తూ ఫిదా చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ లో బ్యూటీఫుల్ గా ఉంది. 
 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ సౌత్ ఆడియెన్స్ కు దగ్గర కాబోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. కొద్ది కాలంగా దక్షిణాది ప్రేక్షకులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మున్ముందు మళ్లీ వెండితెరపై అలరించబోతోంది.
 

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు ఊపూపిన ఈ ముద్దుగుమ్మ నాలుగేళ్లు ఎలాంటి సినిమాకు సైన్ చేయలేదు. అంతకుముందు రకుల్ నటించిన కొన్ని చిత్రాలు సరైన ఫలితాలు అందించకపోవడంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. 


ఈ క్రమంలో బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటించింది. గతేడాది ఏకంగా ఐదు సినిమాలతో వెండితెరపై మెరిసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ మూవీలు పెద్దగా ఆకట్టుకోకపోయినా రకుల్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అందరినీ ఆశ్చర్య పరిచింది. 

అయితే, ప్రస్తుతం హిందీలోనూ ఈ భామకు పెద్దగా ఆఫర్లు లేవు. దీంతో మళ్లీ సౌత్ సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్రెడిషనల్ లుక్స్ లో మెరుస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో మంత్ర ముగ్ధులను చేస్తోంది.
 

తాజాగా ట్రెండీ క్యాజువల్ వేర్ లో దర్శనమిచ్చింది. ఫుల్ స్లీవ్ ధరించి ఓపెన్ గా వదిలేసి ఎద అందాలను విందు చేసింది. ఈ అవుట్ ఫిట్ లో మాత్రం బ్యూటీఫుల్ గా మెరిసింది. మత్తెక్కించే చూపులతో మతులు పోగొట్టింది. తనదైన ఫోజులతో కట్టిపడేసింది.

తన నయా లుక్స్ తో ఇలా ఫ్యాన్స్, నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తోంది. వాళ్లూ లైక్స్, కామెంట్లు పెడుతూ ఢిల్లీ భామను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రకుల్ తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్2’, ‘ఆయలాన్’లో నటిస్తూ బిజీగా ఉంది. 

Latest Videos

click me!