మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటీ? ఇది మామూలు పిచ్చి కాదు, పరాకాష్ట!

Published : Jun 12, 2023, 01:53 PM IST

హీరోయిన్ లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ వివాహం చేసుకోనున్నారు. వీరి నిశ్చితార్థం ముగిసింది. కాగా జనాలు మెగా కోడలు లావణ్య క్యాస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారట.   

PREV
17
మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటీ? ఇది మామూలు పిచ్చి కాదు, పరాకాష్ట!
Varun Tej - Lavanya Tripathi engagement

లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవుతున్న విషయం తెలిసిందే. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఆమెను ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. గత ఐదేళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2017లో మిస్టర్ మూవీ కోసం జత కట్టిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.  రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల అధికారికంగా ప్రకటించారు. 
 

27


నాగబాబు నివాసమైన మణికొండ ఫామ్ బీడ్ గేటెడ్ కమ్యూనిటీలో జూన్ 9న వరుణ్ తేజ్-లావణ్యల నిశ్చితార్థం వేడుక జరిగింది. సాయంత్రం 7-8 గంటల మధ్య వరుణ్-లావణ్య ఉంగరాలు ఒకరికొకరు ధరింపజేసుకుని నిశ్చితార్థం పూర్తి చేశారు. వరుణ్ తేజ్ నిశ్చితార్థం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది. అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తో  పాటు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి వేడుకకు వచ్చారు. 
 

37
Varun Tej - Lavanya Tripathi engagement

మెగా ఫ్యామిలీకి వరల్డ్ వైడ్ అభిమానులు ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కాగా వారికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఇక మెగా ఫ్యామిలీకి కోడలిగా రావడం అదృష్టం అని చెప్పొచ్చు. నేమ్, ఫేమ్ తో పాటు ఒక మంచి కుటుంబంలోకి వచ్చామనే భరోసా ఉంటుంది. 
 

47

కాగా జనాలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారట. గత మూడు రోజులుగా లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటని గూగుల్ లో సెర్చ్ చేసినట్లు సమాచారం. దీంతో లావణ్య పేరు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. మన తెలుగు వాళ్లకు ఈ క్యాస్ట్ ఫీలింగ్, పట్టింపు, ఒకరి కులం ఏంటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఈ స్థాయిలో ఉందో ఈ పరిణామం తెలియజేస్తుంది. 
 

57


లావణ్య త్రిపాఠి యూపీకి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. డెహ్రాడూన్ లో పెరిగింది. తండ్రి హైకోర్టు న్యాయవాది. తల్లి రిటైర్డ్ టీచర్. ఆమెకు ఓ చెల్లి, తమ్ముడు ఉన్నాడు. ఇక క్యాస్ట్ ఫీలింగ్ పై గతంలో లావణ్య త్రిపాఠి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనుషులు తమ వ్యక్తిత్వం, విజయాలు ఆధారంగా గొప్పవాళ్ళు అవుతారు. కులం వలన కాదని ఆమె చెప్పుకొచ్చారు. తమ కుటుంబంలో కుల పట్టింపులు ఉండవన్నారు. 

67

అందాల రాక్షసి మూవీతో సిల్వర్ స్క్రీన్ కి లావణ్య పరిచయమయ్యారు. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ఈ మధ్య లావణ్య కెరీర్ నెమ్మదించింది. వరుస పరాజయాలతో ఆమె రేసులో వెనకబడ్డారు. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క చిత్రం లేదు. వరుణ్ తేజ్ తో పెళ్లి నేపథ్యంలో ఇకపై ఆమె నటనకు గుడ్ బై చెప్పే ఆస్కారం కలదు. 
 

77

ప్రస్తుతం మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే వీరి నిశ్చితార్థం వెనుక ఓ న్యూస్ వినిపిస్తోంది. మెగా ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న లావణ్య త్రిపాఠికి పలు కండీషన్స్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ జరిగిందని అంటున్నారు. 

click me!

Recommended Stories