మురారి, ముకుంద కలిసి బయటికి వెళ్లారు నేను చూశాను అని చెప్తుంది అలేఖ్య. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ ముకుందే వీడిని బలవంతం పెట్టి తీసుకొని వెళ్ళి ఉంటుంది అని ముకుందని తిట్టుకుంటుంది రేవతి. ఆదర్శ విషయం ఏదైనా తెలిసి ఉంటుంది అందుకే వెళ్లి ఉంటారు అని మాట మార్చేస్తుంది రేవతి. ఒకవేళ తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చి ఉంటారు అని అంటుంది అలేఖ్య. పోలీసు వాళ్లకి సీక్రెట్ ఇన్ ఫార్మర్స్ ఉంటారు మా నాన్నగారు కూడా ఇలాంటి టాస్కులు చాలా చేశారు అంటుంది కృష్ణ.