అప్పుడు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసి.. ఇప్పుడు నాగార్జున రియల్ హీరో అంటూ రేవంత్ రెడ్డి ప్రశంసలు

Published : Jun 29, 2025, 03:22 PM IST

కొన్ని నెలల క్రితం అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన సినీ రాజకీయ వర్గాల్లో సంచలనానికి దారితీసింది.

PREV
15
ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేసిన హైడ్రా 

కొన్ని నెలల క్రితం అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన సినీ రాజకీయ వర్గాల్లో సంచలనానికి దారితీసింది. చెరువుని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించారంటూ ఆరోపణలతో ప్రభుత్వం దాన్ని కూల్చివేసింది. అక్రమ కట్టడాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉక్కు పాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

25
సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జున మధ్య విభేదాలు

అక్రమంగా చెరువులు, కాలువలను ఆక్రమించి ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా హైడ్రా అధికారులు వాటిని కూల్చి వేస్తున్నారు. అయితే దీనిపై కొందరి నుంచి విమర్శలు కూడా వచ్చాయి. నాగార్జున అయితే ఈ సంఘటన విషయంలో తాను న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. దీంతో నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి అంటూ ప్రచారం జరిగింది.

35
అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో రేవంత్ రెడ్డి 

ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయడంతో నాగార్జున కొన్ని వందల కోట్లు నష్టపోయారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున మధ్య విభేదాలు సమసి పోయినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటన జరిగిన తర్వాత పలుమార్లు నాగార్జున సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నిర్వహించిన మీటింగ్ కి నాగార్జున కూడా హాజరయ్యారు. ఆ తర్వాత తన కుమారుడు అఖిల్ అక్కినేని వివాహానికి రేవంత్ రెడ్డిని నాగార్జున ఆహ్వానించారు. అఖిల్ రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. 

45
నాగార్జునపై రేవంత్ రెడ్డి ప్రశంసలు

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున పై ఒక రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేసి ఇప్పుడు నాగార్జున పై రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపిస్తుండడంతో ఆసక్తికరంగా మారింది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైడ్రా అధికారులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేశారు. ఈ సంఘటన తర్వాత నాగార్జున రియలైజ్ అయ్యి తమ్మిడికుంట చెరువు కోసం రెండు ఎకరాలు ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు.

55
నాగార్జున రియల్ హీరో 

నాగార్జునలా ప్రతి ఒక్కరూ నగర అభివృద్ధి కోసం ముందుకు రావాలి. హైదరాబాద్ కోసం నాగార్జున రెండు ఎకరాలు ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. హైడ్రా వచ్చిన తర్వాత కబ్జా చేయాలంటే అందరూ భయపడుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories