రేణు దేశాయ్ కి సాయం చేసిన రాంచరణ్, ఉపాసన..ఎలాగో తెలిస్తే థ్రిల్ కావలసిందే, జీవితంలో మరచిపోలేను అంటూ

First Published | Oct 27, 2024, 2:09 PM IST

నటి రేణు దేశాయ్ ఇటీవల జంతువుల సంరక్షణ కోసం చాలా శ్రమిస్తున్నారు. ఇటీవల వరదలు సంభవించినప్పుడు సొంత ఖర్చులతో అనేక జంతువులని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఇటీవల రేణు దేశాయ్ సొంతంగానే జంతువుల కోసం ఎన్జీవో ఆర్గనైజేషన్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 

Renu Desai

నటి రేణు దేశాయ్ ఇటీవల జంతువుల సంరక్షణ కోసం చాలా శ్రమిస్తున్నారు. ఇటీవల వరదలు సంభవించినప్పుడు సొంత ఖర్చులతో అనేక జంతువులని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. జంతువులని ప్రేమిస్తూ వాటి సంరక్షణ చూస్తుంటే తనకి ఎంతో సంతృప్తి కరంగా, సంతోష కరంగా ఉందని రేణు దేశాయ్ తెలిపారు. ఇటీవల రేణు దేశాయ్ సొంతంగానే జంతువుల కోసం ఎన్జీవో ఆర్గనైజేషన్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 

తన కుమార్తె ఆద్య పేరుపై శ్రీ ఆధ్య అనే ఎన్జీవో సంస్థని ప్రారంభించారు. యానిమల్ ప్రొటెక్షన్ లో భాగంగా గాయపడిన జంతువులకు అంబులెన్స్ ని కూడా రేణు దేశాయ్ ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఆహారం, మెడికల్ ఖర్చుల కోసం రేణు దేశాయ్ ప్రజల నుంచి విరాళాలు కావాలని విజ్ఞప్తి చేశారు. కనీసం నెలకి 100 రూపాయలు సాయం చేసినా బావుంటుందని కోరారు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి జంతువుల కోసం వెచ్చిస్తానని.. తన సొంత ఖర్చుల కోసం ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయనని హామీ ఇచ్చారు. 

Also Read: కాబోయే అక్కినేని కోడలిని యంగ్ హీరో ఎలా ఇబ్బంది పెట్టాడో తెలుసా..చుక్కలు చూపించిన మహేష్


ఉపాసన విరాళాలు కోరిన వెంటనే రాంచరణ్ సతీమణి ఉపాసన స్పందించారు. రాంచరణ్, ఉపాసన తమ పెంపుడు శునకం రైమ్ ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న సంగతి తెలిసిందే. రాంచరణ్, ఉపాసన ఎక్కడికి వెళ్లినా వారి వెంట రైమ్ కూడా ఉంటుంది. మెగా అభిమానులలో రైమ్ కూడా బాగా ఫేమస్ అయిపోయింది. 

Also Read : చిరంజీవితో సినిమా చేయకూడదని పెద్దలతో మీటింగ్ పెట్టిన నిర్మాత..చివరికి ఆయనే చప్పట్లు కొట్టారు

ఇప్పుడు రైమ్ పేరుపైనే రాంచరణ్, ఉపసన.. రేణు దేశాయ్ కి విరాళం అందించారట. రాంచరణ్, ఉపాసన, రైమ్ తరుపున వచ్చిన విరాళంతో జంతువుల కోసం అంబులెన్స్ కొనుగోలు చేసినట్లు రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. అంబులెన్స్ కోసం విరాళం ఇచ్చిన రైమ్ కి రేణు దేశాయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉపాసన పేరు కూడా ప్రస్తావించారు. 

ఇదిలా ఉండగా రాంచరణ్, ఉపసనకి కూడా జంతువులు అంటే చాలా ఇష్టం. రాంచరణ్ ఫామ్ హౌస్ లో గుర్రాలు, వివిధ జంతువులతో పాటు నెమళ్ళు కూడా ఉంటాయి. ఏది ఏమైనా ఉపాసన.. రేణు దేశాయ్ కి ఇలా విరాళం అందివ్వడంతో మెగా అభిమానులు థ్రిల్ అవుతున్నారు. రేణు దేశాయ్ తన కుమార్తె పేరుపై ఎన్జీవో సంస్థని ప్రారంభించడం పట్ల కూడా సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. తన కుమార్తె పేరుపై ఎన్జీవో ప్రారంభించిన తర్వాత.. ఈ రోజును జీవితంలో మరచిపోలేను అంటూ రేణు దేశాయ్ సంతోషం వ్యక్తం చేశారు. 
 

Latest Videos

click me!