కాబోయే అక్కినేని కోడలిని యంగ్ హీరో ఎలా ఇబ్బంది పెట్టాడో తెలుసా..చుక్కలు చూపించిన మహేష్

First Published | Oct 27, 2024, 12:09 PM IST

తెలుగు అమ్మాయిగా చిత్ర పరిశ్రమలోకి వెళ్లి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా రాణిస్తున్న హీరోయిన్ శోభిత ధూళిపాల. మరికొన్ని రోజుల్లోనే శోభిత అక్కినేని వారి కోడలు కాబోతోంది. ఆల్రెడీ నాగ చైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగింది.

తెలుగు అమ్మాయిగా చిత్ర పరిశ్రమలోకి వెళ్లి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా రాణిస్తున్న హీరోయిన్ శోభిత ధూళిపాల. మరికొన్ని రోజుల్లోనే శోభిత అక్కినేని వారి కోడలు కాబోతోంది. ఆల్రెడీ నాగ చైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే పసుపు దంచి పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించారు. శోభిత తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. 

మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటించింది. గూఢచారి, మేజర్ రెండు చిత్రాలతో శోభిత, అడివి శేష్ మంచి స్నేహితులు అయ్యారు. కానీ షూటింగ్ లో మాత్రం అడివిశేష్.. శోభితని బాగా ఆటపట్టిస్తాడట. తాను అనుకున్నట్లు సన్నివేశం రాకుంటే బాగా ఇబ్బంది పెట్టేసాడట. ఈ విషయాన్ని శోభిత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 


26/11 ముంబై దాడుల నేపథ్యంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ త్యాగం, పోరాటం ఆధారంగా చేసుకుని అతడి బయోపిక్ ని అడివిశేష్ తెరకెక్కించారు. అదే మేజర్ మూవీ. ఈ చిత్రంలో శోభిత కీలక పాత్రలో నటించింది. విశేషం ఏంటంటే ఈ చిత్ర నిర్మాతలలో మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ కూడా ప్రొమోషన్స్ లో పాల్గొన్నారు. శోభిత మహేష్ బాబుతో మాట్లాడుతూ శేష్ తనని చాలా ఇబ్బంది పెట్టాడు అని సరదాగా కంప్లైంట్ చేసింది. 

తెలుగు ఏడుపు, హిందీ ఏడుపు వేరు వేరుగా ఉంటాయట. ఒక సీన్ లో నన్ను తెలుగు అమ్మాయి లాగా ఏడవమని చెప్పాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఏడుపు తెలుగులో ఒకలా, హిందీలో ఒకలా ఎలా ఉంటుందో నాకు తెలియదు అని చెప్పింది. అడివిశేష్ దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా.. నువ్వు చాదస్తానికి పరాకాష్టలా ఉన్నావే అంటూ మహేష్ సెటైర్ వేశారు. అంటే ఇప్పుడు హిందీ వాళ్ళు ఒకలా ఏడుస్తారు.. తెలుగు వాళ్ళు మరోలా ఏడుస్తారా అంటూ మహేష్ బాబు.. అడివి శేష్ కి చుక్కలు చూపించారు. 

శోభిత మాట్లాడుతూ.. హిందీ వాళ్ళ ఏడుపు, తెలుగు వాళ్ళ ఏడుపు నాకు చేసి చూపించు అని అడిగా.. తాను మాత్రం ఒకే విధంగా చేసేవాడు. నా దగ్గర మాత్రం వేరియేషన్స్ కావాలట. షూటింగ్ లో తన ఫ్రస్ట్రేషన్ వచ్చింది అని శోభిత పేర్కొంది. అడివి శేష్ చేష్టలకు మహేష్ బాబు పడీపడీ నవ్వుకున్నారు. 

Latest Videos

click me!