లక్షల రూపాయల ఆస్తులు సంపాదించినా ఆమెకు మనశ్శాన్తి లేకుండా పోయింది. చివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న జెమినీ గణేశన్ ని కూడా ఆమె దూరమయ్యారు. ఒంటరితనాన్ని, భర్త దూరమైన వేదనను మర్చిపోవడానికి సావిత్రి మద్యానికి బానిస అయ్యారు. ఆస్తులు అన్నీ కరిగిపోయాయి. సావిత్రి 1980లో బెంగుళూరు వెళ్లారు. అక్కడ చాణక్య హోటల్ లో బస చేశారు. అక్కడే ఆమె కోమాలోకి వెళ్లారు.
అనంతరం ఆమెను చెన్నైకి తరలించారు. 19 నెలలు సుదీర్ఘ కాలం సావిత్రి కోమాలో ఉన్నారు. ఆమె శరీరం చిక్కి శల్యమైపోయింది. 1981 డిసెంబర్ 26న సావిత్రి కన్నుమూశారు. సావిత్రి అంత్యక్రియలకు ఎంజీఆర్, ఏఎన్నార్, జయసుధ, గుమ్మడి, భారతీ రాజా తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు సావిత్రి అంత్యక్రియలకు హాజరయ్యారు. చిరంజీవి నటించిన పునాదిరాళ్ళు, ప్రేమ తరంగాలు చిత్రాల్లో సావిత్రి నటించారు. అయినప్పటికీ చిరంజీవి సావిత్రి అంత్యక్రియలకు హాజరు కాలేదని సమాచారం. ఈ తరం నటుల్లో బాలకృష్ణ మాత్రమే హాజరయ్యారట. అందుకు కారణం... ఎన్టీఆర్ వెళ్లలేకపోయారట. ఆ కుటుంబం నుండి బాలకృష్ణ వెళ్లారట.