ఆ తర్వాత తనని చూడగానే ఏమనిపించిందని అడిగిందట. ఏమనిపించలేదని, చూడ్డానికి బాగున్నావు, అందంగా ఉన్నావని, మంచి అమ్మాయి అనుకున్నట్టు చెప్పాడట. అయితే తాను ఎక్కువగా మాట్లాడతానని, ప్రతిదీ వాగేస్తానని, కానీ అతను కామ్ పర్సన్ అని, తక్కువగా మాట్లాడతాడని చెప్పింది రేణు దేశాయ్. బయట ఆయనకు కోపం ఉంటుందనే ప్రచారం జరుగుతుంది, కానీ పవన్ బేసింగ్‌గా కామ్ పర్సన్ అని, ఎక్కువగా మాట్లాడడు, షే పర్సన్ అని తెలిపింది రేణు దేశాయ్.