ఆ మధ్య చిరంజీవి గెస్ట్ గా డిజిటల్ మీడియాకి సంబంధించిన ఈవెంట్ జరిగింది. ఇందులో యాంకర్ సుమ హోస్ట్ గా చేశారు. ఈవెంట్లో స్టేజ్‌పై చిరంజీవి, సుమ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ నడిచింది. అందులో యాంకర్ సుమ ఓ కోట్,ప్యాంట్ వేసుకుని వచ్చింది. అయితే అది తనదే అంటూ చిరంజీవి చెప్పి అందరి ముందు పరువు తీశారు. స్టేజ్‌పై నుంచే భార్య సురేఖకి ఫోన్ చేసి, తన కోట్ మిస్ అయ్యిందన్నావుగా, సుమ కొట్టేసింది, దొరికిపోతుందిలే, ఇచ్చేస్తది అని చెప్పడం హైలైట్ గా నిలిచింది.