Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?

Published : Dec 08, 2025, 07:51 PM IST

రేణు దేశాయ్‌ తెలుగులోకి `బద్రి` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే పవన్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందే ఓ స్టార్‌ హీరో సినిమా నుంచి రిజెక్షన్‌కి గురయ్యింది రేణు. 

PREV
16
`బద్రి`తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్‌

రేణు దేశాయ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య అనే విషయం తెలిసిందే. పవన్‌ మొదటి భార్యకి విడాకులు ఇచ్చి ఆ తర్వాత రేణు డేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `బద్రి` సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది రేణు. ఈ మూవీతోనే ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 13ఏళ్ల క్రితమే వీరిద్దరు విడిపోయారు. అయితే తరచూ రేణు దేశాయ్‌ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య తన కెరీర్‌ గురించి ఓ సంచలన విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వివరణ ఇచ్చింది.

26
స్టార్‌ హీరో సినిమాకి రేణు దేశాయ్‌ ఆడిషన్‌

ఇదిలా ఉంటే రేణు దేశాయ్‌ `బద్రి` సినిమాకి ముందు మోడల్‌గా చేసింది.  ఆ సమయంలోనే చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చింది రేణు దేశాయ్‌. అలా ఓ టాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమాకి కూడా ఆడిషన్‌ ఇచ్చిందట. ఏకంగా హీరోతో ఫోటో షూట్‌ కూడా చేశారట. కానీ చివరి నిమిషంలో ఆ సినిమాని నుంచి రిజెక్ట్ చేశారు. అలా రేణు బ్లాక్‌ బస్టర్‌ మూవీని కోల్పోయింది. మరి ఆ సినిమా ఏంటి? ఆకథేంటో చూస్తే.

36
`ప్రేమంటే ఇదేరా` మూవీకి ఆడిషన్‌ ఇచ్చిన రేణు దేశాయ్‌

రేణు దేశాయ్‌ మోడల్‌గా ఉన్న సమయంలో చాలా ఆడిషన్స్ ఇచ్చింది రేణు దేశాయ్‌. అలా తెలుగులో `ప్రేమంటే ఇదేరా` మూవీకి కూడా ఆడిషన్‌ ఇచ్చిందట. ఈ సినిమాకి ఐశ్వర్యా రాయ్‌ని అనుకున్నారట. కానీ ఆమె చేయలేదు. ఆ తర్వాత అమిషా పటేల్‌ని అనుకున్నారట. ఆమెతోపాటు రేణు దేశాయ్‌, భూమిక, రీమా సేన్‌ వంటి హీరోయిన్లని ఆడిషన్‌ చేశారట. వెంకటేష్‌తో కలిసి ఫోటో షూట్‌ కూడా చేశారట. కానీ ఎవరూ సెట్‌ కాలేదని, చివరికి ప్రీతి జింటాని ఎంపిక చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు జయంత్‌ సీ పరాన్జీ రాజేష్‌ మన్నే యూట్యూబ్‌ ఛానెల్‌లో వెల్లడించారు.

46
ఇండస్ట్రీ హిట్‌గా `ప్రేమంటే ఇదేరా`

అలా రేణు దేశాయ్‌.. వెంకటేష్‌ హీరోగా నటించిన `ప్రేమంటే ఇదేరా` చిత్రం నుంచి రిజెక్షన్‌ చేశారు. ఈ మూవీకి జయంత్‌ సీ పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 1998 అక్టోబర్‌ 30న విడుదలైంది. ఈ సినిమా లవ్‌ స్టోరీస్‌లో అప్పట్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అటు యూత్‌ని, ఇటు ఫ్యామిలీని ఆకట్టుకుంది. బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఓ రకంగా అది ఇండస్ట్రీ హిట్‌ అని చెప్పొచ్చు.

56
వెంకటేష్‌ బర్త్ డే రోజు `ప్రేమంటే ఇదేరా` రీ రిలీజ్‌

తాజాగా ఈ మూవీని రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 13న వెంకటేష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `ప్రేమంటే ఇదేరా` మూవీని రీ రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో అప్పుడు సంచలనం సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. వెంకీ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన `కలిసుందాం రా` మూవీని కూడా రీ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. ఇక ప్రస్తుతం వెంకటేష్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. దీంతోపాటు చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి రూపొందిస్తున్న `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీలో గెస్ట్ గా కనిపించబోతున్నారు.

66
రేణు దేశాయ్‌ రీఎంట్రీ

ఇదిలా ఉంటే రేణు దేశాయ్‌ పవన్‌తో `బద్రి`, `జానీ` చిత్రాలు చేసింది. ఆ తర్వాత నటనకు దూరమయ్యింది. ఆ మధ్య రవితేజతో `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రంలో మెరిసింది. చాలా ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా మళ్లీ గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం స్టార్ట్ అయ్యింది. ఇందులో అనసూయ కూడా కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories