పవన్ కళ్యాణ్ తో 21 ఏళ్ళ వయసులో..ఇప్పటికీ మరచిపోలేకపోతున్న రేణు దేశాయ్, అన్నీ గుర్తున్నాయి అంటూ

First Published | Aug 4, 2024, 5:05 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరి పిల్లలు అకిరా, ఆద్య ఇద్దరి వద్ద ఉంటున్నారు. అకిరా టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ఆల్రెడీ చర్చ మొదలైంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరి పిల్లలు అకిరా, ఆద్య ఇద్దరి వద్ద ఉంటున్నారు. అకిరా టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ఆల్రెడీ చర్చ మొదలైంది. రేణు దేశాయ్ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి అకిరా గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

రేణు దేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో తన పిల్లలు, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. అవి కాస్త వైరల్ అవుతుంటాయి. బద్రి చిత్రంతో ఏర్పడ్డ పరిచయంతో పవన్ , రేణు దేశాయ్ ప్రేమలో పడ్డారు. సహజీవనం చేశాక, అకిరా పుట్టాక పెళ్లి చేసుకున్నారు. 


పవన్, రేణు దేశాయ్ కలసి బద్రి, జానీ చిత్రాల్లో నటించారు. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి లాంటి చిత్రాలకు రేణు దేశాయ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పోస్ట్ లు ఆమె పెడుతుండడంతో.. ఆమె కళ్యాణ్ ని మరచిపలేకపోతోందా అనే కామెంట్స్ కూడా నెటిజన్లు చేశారు. వాళ్ళకి ఆమె సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. 

తాజాగా రేణు దేశాయ్.. ఖుషి చిత్రంలోని ఏ మేరా జహా అనే సాంగ్ క్లిప్ ని పోస్ట్ చేశారు. ఈ సాంగ్ కి ఎడిటర్ రేణు దేశాయ్ నే కావడం విశేషం. ఈ సాంగ్ గురించి రేణు దేశాయ్ చెబుతూ.. ఇది నేను ఫస్ట్ టైం 21 ఏళ్ళ వయసులో ఎడిట్ చేసిన పాట. 

Pawan Kalyan

ఈ పాటలో ప్రతి ప్రేము నాకు గుర్తుంది అని రేణు దేశాయ్ పేర్కొంది. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రేణు దేశాయ్ గురించి మరింతగా చర్చ పెరిగింది. 

రేణు దేశాయ్ ఇటీవల సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రవితేజ టైగర్ నాగేశ్వర రావు చిత్రంలా రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించింది. అయితే ఆ మూవీ సక్సెస్ కాలేదు. 

Latest Videos

click me!