రూ.2000 లేకపోవడంతో ఆర్జీవీ దగ్గరికి వెళ్లిన టాలీవుడ్ స్టార్ హీరో..ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అంటూ..

First Published | Aug 4, 2024, 4:13 PM IST

రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఆయన సినిమా టేకింగ్ కెపాసిటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొత్త వారికి అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తారనే ప్రశంసలు రామ్ గోపాల్ వర్మకి ఉన్నాయి.

రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఆయన సినిమా టేకింగ్ కెపాసిటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొత్త వారికి అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తారనే ప్రశంసలు రామ్ గోపాల్ వర్మకి ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ, మాస్ మహారాజ్ రవితేజ మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగిందట. 

శివ చిత్రం తర్వాత రామ్ గోపాల్ వర్మ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. శివ చిత్రం ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఆ మూవీలో రాంగోపాల్ వర్మ చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. 


నెక్స్ట్ మూవీలో కూడా కొత్త వారికీ ఛాన్స్ ఇస్తారేమోనని రవితేజ అనుకున్నారు. రవితేజ అప్పటికి ఇంకా హీరో కాలేదు. చిన్న చిన్న పాత్రలకు కూడా తెగ కష్టపడాల్సి వచ్చేది. రామ్ గోపాల్ వర్మ ఆడిషన్స్ చేస్తున్నారని తెలియడంతో రవితేజ కూడా వెళ్లారట. 

ఆడిషన్స్ కోసం వెళ్లిన చాలా మంది తమ ఫోటోలని ఆల్బమ్ లో పెట్టుకుని తీసుకెళ్లారు. కానీ రవితేజ మాత్రం తన ఫోటోని న్యూస్ పేపర్ లో చుట్టి రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ కి ఇచ్చారట. అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఆశ్చర్యపోయారట. ఆల్బమ్ కొనాలంటే 2 వేలు అవుతుంది. ఆ డబ్బుతో తాను రెండు నెలలు రూమ్ కి, ఫుడ్ కి సరిపోతుంది అని రవితేజ తెలిపారు. 

ఈ విషయాలని రవితేజ మంచు లక్ష్మితో జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న ఒక గాసిప్ ని కూడా మంచు లక్ష్మి రవితేజకి తెలిపింది. మీరు ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అంట కదా అని ప్రశ్నించింది. వాడుకుని అవసరం తీరిపోయాక వదిలేస్తారు అని ఒక రూమర్ ఉంది.. దర్శకులు నిర్మాతల విషయంలో అని మంచు లక్ష్మి ప్రశ్నించింది. 

దీనితో రవితేజ షాక్ అయ్యారు. ఈ రూమర్ నువ్వు చెబుతుంటేనే విన్నా. అయినా వినడానికి చాలా బావుంది. నాకు పూరి జగన్నాధ్, శ్రీనువైట్ల, రాజమౌళి ఇప్పటికి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళతో కలసి పార్టీలకు కూడా వెళుతుంటా. పూరితో అయితే పబ్ లకు కూడా వెళుతుంటా అని రవితేజ అన్నారు. 

Latest Videos

click me!