900 కోట్లు ఇస్తే విడాకులు ఇస్తా.. భర్తకు షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..

First Published | Aug 4, 2024, 4:46 PM IST

విడాకులిస్తాను కాని భరణం కింది 900 కోట్లు ఇవ్వాలటూ.. నటుడైన ఓ భర్తకు.. స్టార్ హీరోయిన్ కండీషన్ పెట్టింది. ఇంతకీ ఎవరా కాస్ట్లీ నటి.. 

ఎవరైనా విడాకులు తీసుకోవాలంటే.. అంతో ఇంతో భరణం కింద భర్త నుంచి లాగాలని చూస్తారు. మహా అయితే లక్షలు.. బాగా ఉన్నవారు అయితే.. ఓ రెండు మూడు కోట్లు అంతకంటే ఎక్కువ భరణాలు ఇచ్చినట్టు ఎక్కడా వార్తలు లేవు. కాని ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ జంట విడాకులు తీసుకోవాలి అనుకుంటే.. ఆ నటి తన భర్తను భరణం కింది 900 కోట్లు అడిగిందట. ఇంతకీ ఎవరా మహానుభావురాలు..? 

మహేష్ బాబు చీరకట్టి.. పూలు పెట్టుకున్న ఏకైక సినిమా..? అంత సాహసం ఎందుకు చేశాడు..?

ప్రస్తుతం ప్రపంచం దేశాలలో ఫిల్మ్ ఇండస్ట్రీ జనాలతో పాటు.. నెటిజన్లు కూడా ముక్కున వేలు వేసుకుని ఔరా అనుకునే విధంగా ప్రవర్తించింది వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్.. హాలీవుడ్ స్టార్  జెన్నిఫర్ లోపేజ్. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె పాటలంటే చాలామందికి పిచ్చి.. జెన్ని షోకు లక్షల్లో వస్తుంటారు. ఇక ఈమె తన జీవితంలో 5 సారి విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతోంది. 


ప్రస్తుతం ప్రపంచం దేశాలలో ఫిల్మ్ ఇండస్ట్రీ జనాలతో పాటు.. నెటిజన్లు కూడా ముక్కున వేలు వేసుకుని ఔరా అనుకునే విధంగా ప్రవర్తించింది వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్.. హాలీవుడ్ స్టార్  జెన్నిఫర్ లోపేజ్. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమె పాటలంటే చాలామందికి పిచ్చి.. జెన్ని షోకు లక్షల్లో వస్తుంటారు. ఇక ఈమె తన జీవితంలో 5 సారి విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతోంది. 
 

అయితే ఇక్కడ విషేషం ఏంటంటే... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల వ్యవహారంగా వీరిది నమోదు కాబోతోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో ఇదే  చర్చ జరుగుతున్నది. గత కొద్ది నెలలుగా హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లోపేజ్, బెన్ అఫ్లెక్ జంట విడాకులు తీసుకోవాలని  అనుకుంటున్నారు. విడాకులేగా తీసుకుందా అంటే సరిపోదు..ఇలా తాను విడిపోవడానికి  బెన్ నుంచి జెన్నిఫర్ 900 కోట్ల భరణం  కోరుతుంది. 

Jennifer Lopez and Ben Affleck

 జెన్నీఫర్ లోపేజ్  బెన్ అఫ్లేక్ తో బ్రేకప్ చెప్పడం ఇది మొదటిసారి కాదు.. గతంలో రెండు సార్లు బెన్ తో విడిపోయింది. మళ్ళీ కలిసింది. ఇక ఇప్పుడు విడిపోతే బెన్ తో మూడో సారి విడాకుల తంతు అవుతుంది. ఈమధ్యలో ఆమె రెండు సార్లు ఇతర స్టార్స్ ను కూడా పెళ్లాడి విడిపోయింది. మొత్తంగా  ఆమెకు అధికారికంగా 5వ సారి ఇది బ్రేకప్. గతంలో ఓజానీ, మార్క్ ఆంథోని, క్రిస్ జూడ్‌తో  కలిసుండి ఆతరువాత విడాకులు తీసుకుంది జెన్ని. 
 

ఇక జెన్నితో మూడోసారి బ్రేకప్ కు రెడీ అవుతున్న  బెన్ అఫ్లెక్‌ కూడా  గతంలో జెన్నిఫర్ గార్నర్ తో విడాకులు జరిగాయి. బెన్ కుఇది నాలుగోసారి విడాకులు అవుతాయి. హాలీవుడ్ సమాచారం ప్రకారం ప్రస్తుతం  ఇద్దరి లాయర్ల మధ్య విడాకులు చర్చలు జరుగుతన్నాయట. ఇద్దరిమధ్య అవగాహన కుదిరితే డివోర్స్ కు రెడీ అయినట్టే అంటున్నారు. అయితే బెన్ నుంచి విడాకులు తీసుకోవడానికి అతడి ఆస్తిలో సగం వాటా అడుగుతున్నదనే ప్రచారం జరుగుతున్నది. 

Ben Affleck and Jennifer Lopez

జెన్నీఫర్ లోపేజ్ కు ఆస్తి తక్కువేమి లేదు. ఆమె ఆస్తి విలువ దాదాపుగా 500 మిలియన్ డాలర్లు  ఉండవచ్చనే అంచనాలున్నాయి.  ఇండియన్ కరెన్సీలో  లెక్క వేస్తే.. దాదాపు 4000  కోట్ల ఆస్తి ఆమె సొంతం అని తెలుస్తోంది. అటు బెన్ ఆస్తులు చూస్తే దాదాపు 1800 కోట్లు ఉండవచ్చు అని అంచనా. ఇక  అందులోనే 900 కోట్లను జెన్నీ భరణంగా అడుగుతున్నట్టు తెలుస్తోంది.  మరి వీరి వ్యవహారం ఎంతర వరకూ సాగుతుందో చూడాలి. 

Latest Videos

click me!