బద్రి చిత్రం అంత పెద్ద హిట్ అయ్యాక కూడా రేణు దేశాయ్ ఎక్కువగా సినిమాల్లో నటించలేదు. పవన్ తో జానీ చిత్రం చేశారు. ఖుషి, గుడుంబా శంకర్, బాలు లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ గా, ఎడిటర్ గా పనిచేశారు. తనకి నటనపై కంటే ఫిలిం మేకింగ్ పైనే ఎక్కువ ఆసక్తి ఉండేది అని రేణు దేశాయ్ తెలిపారు. రేణు దేశాయ్ కోరుకున్నట్లు బద్రి చిత్రం ఎప్పుడు రీ రిలీజ్ అవుతుందో చూడాలి.