100% లవ్, మనం, ప్రేమమ్ చిత్రాలతో నాగ చైతన్య టైర్ టు హీరోగా సెటిల్ అయ్యాడు. నాగ చైతన్య సక్సెస్ లో తండ్రి నాగార్జున పాత్ర చాలా ఉంది. అక్కినేని వారసుడిగా గ్రాండ్ గా లాంచ్ చేశాడు. నిజానికి నాగ చైతన్య నాగార్జున వద్ద పెరగలేదు. ఆయన బాల్యం చెన్నైలో గడిచింది. నాగ చైతన్య తల్లి లక్ష్మి చెన్నైలో ఉండేవారు. దాంతో నాగ చైతన్య అక్కడే పెరిగాడు.
అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చేవాడు. తండ్రి నాగార్జునతో గడిపేవాడు. నాగ చైతన్య ఉన్న ఆ నాలుగు రోజులు నాగార్జునకు పండగేనట. నాగ చైతన్యతో టైం స్పెండ్ చేసేవాడట. హైదరాబాద్ లోని పలు ప్రదేశాలకు తిప్పేవాడట. నాగ చైతన్య తిరిగి వెళ్లిపోతుంటే నాగార్జునకు గుండె పగిలినంత పనయ్యేదట. చాలా ఎమోషనల్ అయ్యేవాడట.