ఆ సినిమా కోసం డైట్ చేసినప్పుడు హెల్త్ పాడైంది: విక్రమ్

First Published Oct 11, 2024, 9:55 AM IST

అపరిచితుడు కంటే ముందే 'సేతు', 'శివపుత్రుడు', 'సామి', 'జెమిని' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్.

vikram, aparichithudu, thangalaan


తమిళ స్టార్ హీరో  విక్రమ్..   పేరు చెప్పగానే ఎన్నో వైవిద్యమైన పాత్రలు గుర్తు వస్తాయి. తన నటనతో, అంతకు మించి గెటప్ లతో ఆయన అలరించిన తీరు మార్చపోవటం కష్టం. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన అపరిచితుడు సినిమాని మర్చిపోవటం కష్టమే. ఆ చిత్రంలో అతడు చేసిన నటనకు ఫిదా అయిపోవాల్సిందే. అయితే ఆయన ఆ  పాత్రల కోసం పడే కష్టం, డైట్ మాత్రం మామూలు వాళ్లు చెయ్యలేరు. 

vikram, aparichithudu, thangalaan


కెరీర్  ప్రారంభంనుంచి తన పాత్రలకు ఏదో ఒక కొత్తదనం అద్దాలనే తాపత్రయమే ఈ రోజు ఈ స్టేజికి విక్రమ్ ని తీసుకొంచ్చింది. అంతెందుకు రీసెంట్ గా వచ్చిన తంగలాన్ చిత్రంలో ఆయన్ని చూసిన వారికి మతిపోయింది. ఆ మేకప్, అంతకు మించి ఆయన శరీరం బరువు తగ్గించుకున్న తీరు మంతిపోగొట్టింది. అయితే చాలా మందికి ఓ డౌట్ ..అంత కష్టమైన డైట్ చేస్తే అది శరీరంపై ఇంపాక్ట్ చూపించదా...ఆరోగ్యం పాడవదా అంటే దానికి విక్రమ్ ఓ ఇంటర్వూలో  సమాధానం చెప్పారు.

Latest Videos


vikram, aparichithudu, thangalaan


అపరిచితుడు కంటే ముందే 'సేతు', 'శివపుత్రుడు', 'సామి', 'జెమిని' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్. విభిన్నమైన కథాంశం ఎంచుకుని తెరమీద నటుడికి పర్యాయపదంగా మారాడు. విక్రమ్ నటనను చూస్తే ఎవ్వరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అనే పేరు తెచ్చుకున్నాడు.

తమిళంతో పాటు తెలుగులో ఎంతో గుర్తింపుతెచ్చుకున్న విక్రమ్ ను ముద్దుగా అభిమానులు చియాన్ అని పిలుస్తుంటారు. నటుడిగానే కాకుండా గాయకుడిగానూ తానేంటో నిరూపించుకున్నాడు. ఆయన నటనకు ఓ జాతీయ అవార్డుతో పాటు 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, పలు పురస్కారాలు దక్కాయి. ఇక బాలా దర్శకత్వంలో వచ్చిన సేతు సినిమా సమయంలో తన బరువు తగ్గేందుకు బాగా కష్టపడ్డారు.


విక్రమ్ మాట్లాడుతూ... సేతు సినిమా పూర్తిగా ఎక్సపర్మెంట్. అదే నా ఫస్ట్ ఎక్సప్మెంట్. చాలా పెద్ద ప్రయోగం అని చెప్పాలి. ఆ సినిమా కోసం నేను 15 కేజీలు తగ్గాను. లాస్ట్ లో సీన్స్ కోసం చాలా కాలం డైట్ లో ఉన్నాను.గుడ్డు సొన, యాపిల్ ముక్క, క్యారెట్ జ్యూస్, బీట్ రూట్ జూస్, అదీ ఒకే సారి కాకుండా గ్యాప్ లో రోజు మొత్తం తీసుకునేవాడిని. కారు ఉన్నా లొకేషన్ కు ఎనిమిది కిలోమీటర్స్ నడిచి వెళ్లేవాడిని.

ఎక్సర్సైజ్ కాకుండా అలా 16 కిలో మీటర్స్ వాకింగ్ చేసేవాడిని. అయితే ఆ డైట్ అప్పుడు సైంటిఫిక్ గా చేయకపోవటం వల్ల హెల్త్ ఇష్యూలు వచ్చాయి.  ఆ తర్వాత నేను ప్రయోగాలు చేసినా చాలా జాగ్రత్తగా చేస్తూ వస్తున్నాను. ఐ సినిమాకు 25 కేజీలు తగ్గాను. డైరక్టర్ శంకర్ గారు విఎఫ్ ఎక్స్ లో మేనేజ్ చేద్దామన్నారు..నాకు ఇష్టం లేదు. అయితే  అప్పుడు మాత్రం పూర్తిగా సైంటిఫిక్ ఎప్రోచ్ తో కండలు పెంచా, తగ్గాను. అలాగే తంగలాన్ కు కూడా కష్టపడ్డాను అని చెప్పుకొచ్చారు. 


ఇక విక్రమ్ ప్రాణం పెట్టి చేసిన తంగలాన్ విషయానికి వస్తే...దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన తంగ‌లాన్ డెబ్బై కోట్ల‌లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. విక్ర‌మ్, పార్వ‌తి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. తంగ‌లాన్ పాత్ర‌లో కెరీర్‌లో బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్‌ను విక్ర‌మ్ క‌న‌బ‌రిచాడంటూ ఫ్యాన్స్ తో పాటు క్రిటిక్స్ నుంచి కామెంట్స్ వ‌చ్చాయి. అయితే అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటం విక్రమ్ ని నిరాశపరిచిందనే చెప్పాలి.

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
 


తంగ‌లాన్ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. సెప్టెంబ‌ర్ 20న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం చేసారు. కానీ జరగలేదు. ఎగ్రిమెంట్ సమస్యలు వచ్చి ఇప్పుడు అమేజాన్ వెళ్లినట్లు సమాచారం. త‌మిళం, తెలుగుతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఒకే రోజు విడుద‌ల కానున్న‌ట్లు చెబుతోన్నారు. తంగ‌లాన్ ఓటీటీ హ‌క్కుల‌ను   35 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. బ్రిటీష‌ర్ల కాలంలో బ‌ల‌హీన వ‌ర్గాల ప‌ట్ల ఉన్న వివ‌క్ష‌ను యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ అంశాల‌తో ద‌ర్శ‌కుడు పా రంజిత్ ఈ మూవీలో చూపించారు. తంగ‌లాన్ మూవీలో విక్ర‌మ్ స‌ర‌స‌న పార్వ‌తి తిరువోతు హీరోయిన్‌గా న‌టించింది. మాళ‌వికా మోహ‌న‌న్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది.
 

click me!