సమంత కోపం ఎవరి మీద? సంచలనంగా ఆ ఫోటో... రూమర్స్ మధ్య స్టార్ లేడీ సంచలన పోస్ట్ 

First Published | Aug 15, 2024, 6:37 PM IST

సమంత మిడిల్ ఫింగర్ చూపుతూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఇటీవల ఆమె ఎఫైర్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో సమంత పోస్ట్ సంచలనం రేపుతోంది. 
 

Samantha


గత వారం రోజులుగా సమంత పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆగస్టు 8న సమంత మాజీ భర్త నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆయన హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ మేరకు నాగార్జున సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు. అక్కినేని అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్నాళ్లుగా శోభితతో నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నాడు. 
 

సమంత మాజీ భర్త రెండో పెళ్లి చేసుకుంటున్న నేపథ్యంలో సమంత పేరు తెరపైకి వచ్చింది. తాజాగా సమంత పై ఓ రూమర్ ప్రచారం అవుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉన్నదట. ఈ మేరకు బాలీవుడ్ లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో సమంత ప్రధాన పాత్ర చేసింది. 
 


అలాగే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న హనీ బన్నీ సిరీస్లో సైతం సమంత నటించింది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కి హనీ బన్నీ రీమేక్. రాజ్ అండ్ డీకే హనీ బన్నీ తెరకెక్కించగా సమంత-వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు చేశారు. నవంబర్ 7నుండి హనీ బన్నీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. రాజ్ తో సమంతకు మంచి అనుబంధం ఉంది. అది ప్రేమకు దారి తీసింది అంటున్నారు. 

Samantha

ఈ వార్తలపై సమంత, రాజ్ స్పందించలేదు. తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ కాకరేపుతుంది. ఆమె మిడిల్ ఫింగర్ చూపుతూ ఓ పోజ్ పెట్టింది. సమంత ఎవరికో పరోక్షంగా కౌంటర్ ఇస్తుందనేది అర్థం అవుతుంది. సమంత కోపం ఎవరి మీద అనే చర్చ మొదలైంది. సమంత ఎఫైర్ లో ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత కౌంటర్ ఇచ్చారేమో అనే సందేహం కలుగుతుంది. 

ఈ మధ్య సమంత సినిమాలు తగ్గించింది. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ బ్యానర్ ఏర్పాటు చేసిన సమంత మా ఇంటి బంగారం టైటిల్ తో మూవీ ప్రకటించింది. ఆమె ప్రధాన పాత్ర చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ఈ చిత్రం. మా ఇంటి బంగారం పై మరొక అప్డేట్ లేదు. కొన్నాళ్లుగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. 

Latest Videos

click me!