అనసూయతో బలం పోటీలో శేఖర్‌ మాస్టర్‌ క్రేజీ ప్లాన్‌.. ఒకేసారి అంత మంది అమ్మాయిలు మీద పడటంతో దసరా పండగే

First Published | Aug 15, 2024, 6:57 PM IST

అనసూయ, శేఖర్‌ మాస్టర్‌ కలిసి బలం పోటీలో పాల్గొన్నారు. కానీ అమ్మాయిలంతా కలిసి నలిపేయడంతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ చేసిన పని రచ్చ రచ్చ అయ్యింది. 
 

నటిగా టర్న్ తీసుకున్న అనసూయ బలమైన పాత్రలతో మెరుస్తూనే ఉంది. తన మార్క్ ని చూపించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే తన రేంజ్‌ సినిమాలు రావడం లేదని చెప్పి ఆమె చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో కొంత గ్యాప్‌ కూడా వస్తుంది. ఈ గ్యాప్‌లో ఆమె టీవీ షోస్‌ చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం అనసూయ `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` అనే షోలో మెరుస్తుంది. 
 

ఈ షోలో అనసూయ జడ్జ్ గా, గర్ల్స్ టీమ్‌కి లీడర్‌గా చేస్తుంది. బాయ్స్ టీమ్ కి శేఖర్‌ మాస్టర్‌ లీడర్‌గా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఎవరు తోపు అనేది ప్రతిసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే బాయ్స్, గర్ల్స్ మధ్య బలం పోటీలు జరిగాయి. మొదట బాయ్స్ టీమ్‌లో నటుడిని నటి దీపికా మీదకు ఎగబడి డిస్టర్బ్ చేసింది. ఆ తర్వాత దీపికా రెచ్చగొట్టడంతో నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేరంటూ సవాల్‌ విసిరాడు. 
 


దీంతో అనసూయకి, శేఖర్‌ మాస్టర్‌కి మధ్య బలం పోటీ నిర్వహించారు. ఇందులో కాసేపు హోరాహోరీగా పోటీ పడ్డారు. అనసూయ రెచ్చిపోయింది. కానీ శేఖర్‌ మాస్టర్‌ తగ్గడం లేదు. దీంతో ఇక అమ్మాయిలంతా కలిసి శేఖర్‌ మాస్టర్‌ మీద పడ్డారు. ఆయన చుట్టూ చేరి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. కాసేపు మాస్టారుని నలిపేశాడు. అయినా తగ్గలేదు. చివరికి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అంతేకాదు చెక్కిలి గింతలు పెడుతూ మొత్తానికి శేఖర్‌ మాస్టర్‌ ఓడిపోయేలా చేశారు. 
 

అనసూయతో బలం పోటీలో శేఖర్‌ మాస్టర్‌ ఓడిపోయాడు. స్టార్‌ యాంకర్‌ గెలిచింది. అయితే ఇదంగా శేఖర్‌ మాస్టర్‌ మైండ్‌ గేమ్‌ అని అర్థమవుతుంది. దీపికా అన్న మాటలకు సవాల్‌ విసురుతూ అమ్మాయిలను రెచ్చగొట్టాడు శేఖర్‌ మాస్టర్‌. దీనికి రీతూ చౌదరి, విష్ణు ప్రియా, దీపికా, సౌమ్యరావు ఇలా అంతా కలిసి రెచ్చిపోయి మీదపడ్డారు. కానీ అందరు కలిసి ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ కావాలనే శేఖర్‌ మాస్టర్‌ ఇలా చేశాడని అర్థమవుతుంది. అంత మంది అందమైన అమ్మాయిలు మీదపడి నలిపేస్తే ఇంకేమైనా ఉందా? శేఖర్‌ మాస్టర్‌కి పండగే. ఓ రకంగా ముసలోడికి దసరా పండుగ అన్న సామెత మాదిరిగా, శేఖర్‌ మాస్టర్‌కి ఇది దసరా పండగ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో లేటెస్ట్ ప్రోమోలోని సన్నివేశం ఇది. శ్రీముఖి యాంకర్‌గా చేస్తున్న ఈ షో ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. స్టార్‌ మాలో ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. ఇక అనసూయ ప్రస్తుతం నటిగా బిజీగానే ఉంది. ఇటీవలే ఆమె `సింబా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇది ఘోర పరాజయం చెందింది. ప్రస్తుతం ఆమె చేతిలో `పుష్ప2`, `ఆరి` వంటి సినిమాలున్నాయి. 
 

Latest Videos

click me!