ఏప్రిల్ 1వ తేదీ మనోజ్ కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్బంగా ఫ్యామిలితో జైపూర్ వెళ్లారు. ఆ సమయంలో విష్ణు మనుషులు తన ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న పిల్ల బట్టలు, భార్య దుస్తులు బంగారు నగలు ఎత్తుకెళ్లారని మనోజ్ చెబుతున్నాడు. ఈ విషయాన్ని అప్పుడే తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ రోజు రాజస్థాన్ నుంచి వచ్చి చూస్తే తన కారుని, భార్య కారుని కూడా ఇంటి బయట రోడ్డుపై వదిలేశారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కలుగుచేసుకుని తనకు న్యాయం చేయాలని మనోజ్ వేడుకున్నాడు. హైకోర్టులో కేసు నడుస్తున్నా.. విష్ణు ఆగడాలు సృతిమించుతున్నాయని ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అతను కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకు మనోజ్ రావడంతో ఏందిరయ్యా ఈ రచ్చ, పంచాయతీ మాకు అని ఈ ఘటనలు గమనిస్తున్న కొందరు చర్చించుకుంటున్నారు.