అంతరిక్షంలో ఏలియన్స్, వారితో పోరాటం చేసే వీరుడిగా అల్లు అర్జున్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసే వీడియోలో అనేక రకాల ఆయుధాలు, విచిత్రమైన ఆకారాలతో బొమ్మలు కనిపించాయి. హాలీవుడ్ లో అవతార్ లాంటి చిత్రాల్లో విశ్వంలో మరో గ్రహంలో జీవజాతి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అనే ఫిక్షనల్ కథలు వచ్చాయి. బన్నీ, అట్లీ చిత్రం కూడా అలాంటి కథే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.