పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు వీరే.. రేణు దేశాయ్‌, ఇలియానా, అలియాభట్‌ ఇంకా ఎవరంటే?

Published : Apr 20, 2026, 11:56 AM IST

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయితే మన వద్ద నానా రకాలుగా మాట్లాడుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇవి కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. స్టార్‌ హీరోయిన్లే పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయ్యారు.  

PREV
110
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు

ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ముందే ప్రెగ్నెంట్‌ అయితే మన వద్ద తప్పుగా భావిస్తుంటారు. ఆ అమ్మాయి గురించి చాలా బ్యాడ్‌గా మాట్లాడుకుంటారు. అది సినిమాల్లో అయినా సరే, చాలా ట్రోల్‌ జరుగుతుంది. సోషల్‌ మీడియాలో దారుణంగా కామెంట్‌ చేస్తుంటారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం వీటిని లెక్కచేయకుండా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయ్యారు. తాము కోరుకున్నవాడితో పిల్లల్ని కనేందుకు రెడీ అయ్యారు. ఆల్‌రెడీ కన్నారు. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లలో మీరు ఊహించని స్టార్ బ్యూటీస్‌ ఉండటం విశేషం.

210
పెళ్లికి ముందే అకీరాకి జన్మనిచ్చిన రేణు దేశాయ్‌

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రేణు దేశాయ్‌. ఆమె ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య. వీరిద్దరు `బద్రి` సినిమా సమయంలో ప్రేమలో పడ్దారు. సహజీవనం చేసే సమయంలోనే అకీరా నందన్‌కి జన్మనిచ్చింది రేణు దేశాయ్‌. 2004లో అకీరా నందన్‌ జన్మించగా, 2009లో వీరిద్దరు అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. పవన్‌ కి ముందుగా నందినితో పెళ్లి అయ్యింది. వీరిద్దరికి 2008లో కోర్ట్ విడాకులు మంజూర్‌ చేసింది. ఆ తర్వాత రేణు దేశాయ్‌, పవన్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అనంతరం వీరికి కూతురు ఆధ్య జన్మించింది. ఆ తర్వాత 2012లో ఈ ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం రేణు దేశాయ్‌ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఒంటరిగానే ఉంది.

310
ప్రెగ్నెంట్‌ అయ్యాక పెళ్లి చేసుకున్న ఇలియానా

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన మరో హీరోయిన్‌ ఇలియానా. `పోకిరి` చిత్రంతో తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయిన ఇలియానా.. 2023 మే 13న మైఖేల్‌ డోలన్‌ని పెళ్లి చేసుకుంది. ఆగస్ట్ లో కొడుక్కి జన్మనిచ్చింది. అంటే పెళ్లికి మందే ఆమె ప్రెగ్నెంట్‌ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెంట్‌ కావడం వల్లే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2025 జూన్‌ 19న మరో కొడుక్కి జన్మనిచ్చింది ఇలియానా.

410
పెళ్లికి ముందే అలియా భట్‌ కూడా ప్రెగ్నెంట్‌

ఈ జాబితాలో `ఆర్‌ఆర్‌ఆర్‌` బ్యూటీ అలియాభట్‌ కూడా ఉంది. ఆమె 2022 ఏప్రిల్ 14న హీరో రణ్‌బీర్‌ కపూర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన రెండు నెలలకే అలియా భట్ తాను గర్భం దాల్చిన విషయాన్ని ప్రకటించారు. నవంబర్ 6న కూతురు రహాకు జన్మనిచ్చింది. అంటే, పెళ్లి జరిగిన ఏడు నెలలు కూడా కాకముందే ఆలియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీన్ని బట్టి ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చిందని స్పష్టమవుతోంది.

510
ప్రెగ్నెంట్‌ అయ్యాక ప్రియుడితో అమీ జాక్సన్‌ బ్రేకప్‌

తెలుగులో రామ్ చరణ్ 'ఎవడు', విక్రమ్ 'ఐ' సినిమాలతో సుపరిచితురాలైన అమీ జాక్సన్, ఇంగ్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో సుదీర్ఘంగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే 2019 సెప్టెంబర్‌లో ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత జార్జ్‌తో విడిపోయిన అమీ, ప్రస్తుతం నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. వీరిద్దరు 2024లో మ్యారేజ్‌ చేసుకున్నారు.

610
శ్రుతి హాసన్‌ పుట్టాక రెండేళ్లకి కమల్‌ని పెళ్లి చేసుకున్న సారిక

 కమల్ హాసన్ మాజీ భార్య సారిక 80వ దశకంలోనే సంచలనం సృష్టించారు. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయ్యారు. కమల్, సారికల వివాహం 1988లో జరగగా, అంతకుముందే అంటే 1986లోనే శ్రుతి హాసన్ జన్మించారు. పెళ్లి తర్వాత వీరికి అక్షర హాసన్ పుట్టారు. 2004లో విడాకులు తీసుకున్నప్పటికీ, పిల్లలిద్దరూ తండ్రి కమల్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. 

710
కొంకణా సేన్‌ శర్మ దారి కూడా అదే

జాతీయ అవార్డు గ్రహీత, నటి కొంకణా సేన్ శర్మ కూడా ఈ జాబితాలో ఉన్నారు. రణ్‌వీర్ షోరేతో ప్రేమలో ఉన్న సమయంలోనే ఆమె గర్భం దాల్చారు. వీరిద్దరూ 2010లో వివాహం చేసుకోగా, పెళ్లయిన కొద్ది నెలలకే కొంకణ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ప్రస్తుతం ఈ జంట  విడిగా ఉంటున్నారు.

810
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీని ప్రకటించిన నేహా ధూపియా

బోల్డ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన నేహా ధూపియా, తన ప్రెగ్నెన్సీ విషయంపై చాలా ఓపెన్ గా మాట్లాడారు. 2018లో నటుడు అంగద్ బేడీని పెళ్లాడిన నేహా, తాను వివాహానికి ముందే గర్భం దాల్చానని తన సొంత షో `నో ఫిల్టర్ నేహా`లో ధైర్యంగా వెల్లడించారు. 2018లో పాపకు, 2021లో బాబుకు ఆమె జన్మనిచ్చారు.

910
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన మంచు విష్ణు హీరోయిన్‌

తెలుగులో మంచు విష్ణు సరసన 'సూర్యం' సినిమాలో నటించిన సెలీనా జైట్లీ, 2011లో దుబాయ్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకున్నారు. వివాహమైన అతి తక్కువ కాలంలోనే, అంటే 2012లో ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చినట్లు స్పష్టమైంది. 

1010
ఈ జాబితాలో శ్రీదేవి కూడా ఉందా?

అయితే ఈ లిస్ట్ లో అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఉన్నారట. ఆమె 1996 జూన్‌ 2న నిర్మాత బోణీ కపూర్‌ని మ్యారేజ్‌ చేసుకున్నారు. జాన్వీ కపూర్‌ 1997 మార్చి 6న జన్మించారు. అయితే ఆమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ ని టాక్‌. ఇందులో నిజం ఎంతా అనేది క్లారిటీ లేదు. ఒకప్పుడు ఇలా పెళ్లికి ముందు ప్రెగ్నెంట్‌ కావడం నేరంగా, తప్పుగా భావించారు. కానీ ఇప్పుడిది సెలబ్రిటీలకే పరిమితం కాలేదు, సమాజంలోనూ భాగమయ్యింది. చాలా మంది పెళ్లికి ముందే పిల్లల్ని కనేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories